మూడు ట్వంటీ20 మ్యాచులో సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన చివరి మ్యాచులో భారత్ తమ ముందు ఉంచిన 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ చేతులెత్తేసింది. వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసింది. కీరోన్ పోలార్డ్ ఒంటరి పోరాటం వృధా అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేిసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఏ సమయంలోనూ భారత్ కు సవాల్ విసరలేకపోయింది.

చివరకు 67 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ సిరీస్ ను 2-1 స్కోరుతో సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో చాహర్, భువనేశ్వర్ కుమార్, షమీ, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. వెస్టిండీస్ 152 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. వాల్ష్ మొహమ్మద్ షమీ బౌలింగ్ లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.వెస్టిండీస్ 169 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 

భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్న కీరోన్ పోలార్డ్ ఎట్టకేలకు అవుటయ్యాడు. దాంతో 141 పరుగుల వద్ద వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను అవుటయ్యాడు.

వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జేసన్ హోల్డర్... మనీశ్ పాండే‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కెప్టెన్ పోలార్డ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 

ఇండియాకు బిగ్ బ్రేక్ లభించింది. సిక్సర్ల వీరుడు హిట్మేయర్‌ ఔటయ్యాడు. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో లోకేశ్ రాహుల్ అద్భుతమైన క్యాచ్‌తో హిట్మేయర్ వెనుదిరిగాడు.

టీచాహర్ బౌలింగ్‌లో విధ్వంసక ఆటగాడు పూరన్ భారీ షాట్‌కు యత్నించడంతో శివమ్ దూబే పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు ఔటయ్యాడు. స్వల్ప వ్యవధిలో వెస్టిండీస్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన సిమ్మన్స్ ... శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు

లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ బౌలింగ్‌లో లోకేశ్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ బ్రెండన్ కింగ్ పెవిలియన్ చేరాడు. 

ముంబైలో జరిగిన ఆఖరి టీ20లో వెస్టిండీస్ ముందు భారత్ 241 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచింది. ఇన్నింగ్స్ ఆరంభించినప్పటి నుంచి టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 71, లోకేశ్ రాహుల్‌ 91లు ధాటిగా ఆడి బలమైన పునాది వేశారు.

మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 70తో బ్యాటు ఝళిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో పొలార్డ్, పిర్రే, హోల్డర్, కాంట్రెల్ తలో వికెట్ పడగొట్టారు. 

ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాట్రెల్ బౌలింగ్‌లో కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

వాంఖేడేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ షాట్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 

స్వల్ప వ్యవధిలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. వన్ డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్... పొలార్డ్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దూకుడుగా ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 71 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన హిట్ మ్యాన్ కేస్రిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఓపెనర్ లోకేశ్ రాహుల్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌తో పాటు ధాటిగా ఆడిన రాహుల్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వాంఖేడేలో రెచ్చిపోతున్నాడు. వచ్చి రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడిన రోహిత్ కేవలం 23 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ దూకుడుతో టీమిండియా కేవలం 8 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను దాటింది. 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్‌ల మధ్య ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ సమమైంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ షమి.  

విండీస్‌ జట్టు: లెండిల్‌ సిమన్స్‌, ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌, షిమ్రన్‌ హెట్మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హోల్డర్‌, కారీ పీర్‌, హేడెన్‌ వాల్ష్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కేసరిక్‌ విలియమ్స్‌.