మూడో వన్డేలో 169 పరుగులకి విండీస్ ఆలౌట్... 96 పరుగుల తేడాతో విజయం అందుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా...
టీ20ల్లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ శర్మ, వన్డే ఫార్మాట్‌లో విండీస్‌ను వైట్‌వాష్ చేసి అదిరిపోయే ఆరంభం అందుకున్నాడు. మూడో వన్డేలో 266 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన వెస్టిండీస్, ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు... 37.1 ఓవర్లలో 169 పరుగులకి విండీస్ ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 96 పరుగుల తేడాతో విజయం దక్కింది.
షై హోప్ 5 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో మొదలైన విండీస్ వికెట్ల పతనం బ్రేకులు లేకుండా సాగింది. 13 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ కాగా షమ్రా బ్రూక్స్ డకౌట్ అయ్యాడు...
25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో డారెన్ బ్రావో, నికోలస్ పూరన్ కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగులు జోడించారు. 30 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన డారెన్ బ్రావోని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయగా, 6 పరుగులు చేసిన జాసన్ హోల్డర్ కూడా అతని ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు...
ఫ్యాబియన్ ఆలెన్‌ను కుల్దీప్ యాదవ్ గోల్డెన్ డకౌట్ చేసిన కుల్దీప్ యాదవ్, 34 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు. 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్... అసలు 100 మార్కు అయినా దాటుతుందని అనుకున్న విండీస్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పోరాటం కారణంగా 170+ పరుగులు చేయగలిగింది.
ఈ దశలో ఓడెన్ స్మిత్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.. సిరాజ్ బౌలింగ్‌లో స్మిత్ అవుట్ కాగా, హేడెన్ వాల్ష్, అల్జెరీ జోసఫ్ కలిసి 9వ వికెట్‌కి 47 పరుగులు జోడించారు. 13 పరుగులు చేసిన హేడెన్ వాల్ష్, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా అల్జెరీ జోసఫ్ 56 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 15 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండో బంతికే విరాట్ కోహ్లీ కూడా జోసఫ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...
గత ఐదు వన్డే మ్యాచుల్లో విరాట్ కోహ్లీకి ఇది రెండో డకౌట్ కాగా, కెరీర్‌లో 32వ డక్. ఆ తర్వాత 26 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఓడెన్ స్మిత్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు.
ఈ దశలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి టీమిండియాను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు... 54 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన రిషబ్ పంత్, హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఫ్యాబియన్ ఆలెన్ బౌలింగ్‌లో బ్రూక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
111 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 187 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో దీపక్ చాహార్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు...
వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 53 పరుగులు జోడించిన దీపక్ చాహార్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 5 పరుగులు చేసి అవుట్ కాగా వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి భారత జట్టుకి బాధ్యతాయుతమైన స్కోరు అందించారు..
