Asianet News TeluguAsianet News Telugu

Ind vs WI: చెమటలు పట్టించిన విండీస్.. అయినా భారత్‌దే విజయం

తొలి వన్డేలో విజయం సాధించి ఊపు మీద ఉన్న వెస్టిండీస్ భారత్ పై రెండో వన్డేలో సత్తా చాటాలని చూస్తోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

India vs West Indies 2nd ODI at Visakha updates
Author
Visakhapatnam, First Published Dec 18, 2019, 1:19 PM IST

ఓపెనర్లు సెంచరీతో కదం తొక్కిన వేళ.. బౌలర్లు రాణించడంతో విశాఖ వన్డేలో టీమిండియా.. వెస్టిండీస్‌పై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ 159, లోకేశ్ రాహుల్ 102 పరుగులతో వేసిన బలమైన పునాదిపై శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు చక్కని ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కరేబియన్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత షైహోప్‌తో కలిసి పూరన్ భారత బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరి విధ్వంసంతో వెస్టిండీస్ లక్ష్యానికి త్వరగా చేరువైంది. ఈ క్రమంలో షమీ వరుస బంతుల్లో పూరన్‌, పొలార్డ్‌లను ఔట్ చేశాడు.

ఆ తర్వాత కుల్‌దీప్ స్పిన్ మాయాజాలంతో వరుస బంతుల్లో హోప్, హోల్డర్, జోసెఫ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ అందుకున్నాడు. చివర్లో పౌల్ 46 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలో విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హోప్ 78, పూరన్ 75 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో షమీ, కుల్‌దీప్ యాదవ్‌లు తలో మూడు వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది. 

చివర్లో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన క్యారీ పిర్రె ఎట్టకేలకు ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ ఆడటంతో అతను కోహ్లీకి చిక్కాడు. 

టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. కుల్‌దీప్ వేసిన 33.4వ బంతిని హోప్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాతి బంతికి పంత్ మెరుపు వేగంతో వికెట్లు గీరాటేయడంతో హోల్డర్ స్టంప్ ఔట్ అయ్యాడు. జోసెఫ్ ఆడిన చివరి బంతికి స్లిప్స్‌లో కేదార్ జాదవ్‌ అందుకోవడంతో కుల్‌దీప్ హ్యాట్రిక్ అందుకున్నాడు. 

షమీ పేస్ మ్యాజిక్‌తో విండీస్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన 29 ఓవర్ మూడో బంతికి వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ పొలార్డ్ డకౌట్‌‌‌గా వెనుదిరిగాడు.

సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి భారత అభిమానులను ఆందోళనకు గురిచేసిన పూరన్‌ ఎట్టకేలకు ఔటయ్యాడు. 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పూరన్.. బౌండరీ లైన్‌ వద్ద కుల్‌దీప్‌ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

విండీస్ ఆటగాడు పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను కేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

నిలకడగా ఆడిన వెస్టిండీస్ ఓపెనర్ షైహోప్ అర్థసెంచరీ పూర్తి చేశాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హోప్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 

వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన ఛేజ్ క్లీన్ బౌల్డయ్యాడు. 

తొలి వన్డేలో వెస్టిండీస్‌కు విజయం సాధించిపెట్టిన హెట్మేయర్‌‌ ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్‌కు తోడు రవీంద్ర జడేజా వేగంగా స్పందించడంతో హెట్మేయర్ రనౌట్ అయ్యాడు. 

విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడిన ఓపెనర్ ఈవిన్ లూయిస్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎస్ఎన్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసి విండీస్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 159, లోకేశ్ రాహుల్ 102 సెంచరీలతో రెచ్చిపోగా.. చివర్లో శ్రేయస్ అయ్యర్ 53, పంత్ 39 వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోశారుత. వెస్టిండీస్ బౌలర్లలో కాట్రెల్ 2, పౌల్, జోసెఫ్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. 

భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాట్రెల్ బౌలింగ్‌లో షైహోప్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ వెనుదిరిగాడు. 

టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన వికెట్ కీపర్ 16 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన రిషభ్ పంత్..  పౌల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అయ్యర్‌కు వన్డేల్లో 5వ అర్థసెంచరీ 

ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన హిట్ మ్యాన్ 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 159 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కాట్రెల్ బౌలింగ్‌లో షైహోప్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. 

టీమిండియాకు వెంటనే మరో షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. పొలార్డ్ బౌలింగ్‌లో ఛేజ్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు.

విండీస్ బౌలర్ల ప్రయత్నం ఎట్టకేలకు ప్రయత్నించింది. భారీ భాగస్వామ్యంతో దూసుకెళ్తోన్న ఓపెనర్లను వారు విడదీశారు. సెంచరీ అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించిన లోకేశ్ రాహుల్ 102 పరుగుల వద్ద జోసెఫ్ బౌలింగ్‌లో ఛేజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

విశాఖ వన్డేలో ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ సైతం సెంచరీ పూర్తి చేశాడు. 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అతను వన్డేల్లో 3వ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తిచేశాడు. తన సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడిన హిట్ మ్యాన్ 107 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్‌కిది 27వ సెంచరీ కావడం విశేషం 

ఓపెనర్ లోకేశ్ రాహుల్ అర్థసెంచరీ పూర్తిచేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి ధాటిగా ఆడిన ఆడిన రాహుల్ విండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కేవలం 46 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో రాహుల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది అతనికి వన్డేల్లో 5వ అర్థసెంచరీ.

విశాఖపట్నం: భారత్ తో విశాఖపట్నంలో బుధవారం జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించి మూడు మ్యాచులో సిరీస్ లో 1-0 స్కోరుతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

ఇండియాకు సంబంధించి బౌలింగుపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. తొలి వన్డేలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దాంతో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఇండియాపై సునాయసమైన విజయం సాధించారు. 

ఇండియా జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

వెస్టిండీస్ జట్టు: ఎవిన్ లూయిస్, షాయ్ హోప్, షిమ్రోన్ హెట్ మెయిర్, నికోలస్ పూరన్, రోస్తోన్ చేజ్, కీరోన్ పోలార్డ్ (కెప్టెన్), జాసోన్ హోల్డర్, కీమో పాల్, ఖారీ పీర్రే, అల్జర్రీ జోసెప్, షెల్డన్ కోట్రెల్

Follow Us:
Download App:
  • android
  • ios