టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్... గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా...
ఇంగ్లాండ్ టూర్‌ని విజయవంతంగా ముగించుకున్న భారత జట్టు, నేటి నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. విండీస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...
వెస్టిండీస్ గత రెండు వన్డే సిరీసుల్లో చిత్తుగా ఓడింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేతుల్లో వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్, స్టార్ ప్లేయర్లు లేని భారత జట్టుకి ఎలాంటి పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది...
భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు... వన్డే సిరీస్‌కి దూరంగా ఉంటున్నారు. వన్డే సిరీస్‌కి ఎంపికైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రవీంద్ర జడేజా తొలి రెండు వన్డేలకు దూరం కావడంతో అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు ప్రకటించింది బీసీసీఐ...
జడ్డూ దూరం కావడంతో శిఖర్ ధావన్, యజ్వేంద్ర చాహాల్, శ్రేయాస్ అయ్యర్ మినహా దాదాపు 10-20 మ్యాచుల అనుభవం ఉన్న ప్లేయర్లతోనే బరిలో దిగుతోంది భారత జట్టు. రెండో వన్డే ఆడుతున్న సంజూ శాంసన్‌కి వికెట్ కీపర్‌గా తుదిజట్టులో చోటు దక్కింది. మూడు వన్డేల అనుభవం ఉన్న శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నాడు...
అలాగే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ కరోనా బారిన పడడంతో నేటి మ్యాచ్‌కి అందుబాటులో లేడు. రొమారియో షిఫర్డ్, అల్జెరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, జేడెన్ సీల్స్‌లకు తుది జట్టులో చోటు దక్కింది.
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ జట్టు: షై హోప్, బ్రెండన్ కింగ్, షామ్రా బ్రూక్స్, కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్, అకీల్ హుస్సేన్, రొమారియో షిఫర్డ్, అల్జెరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, జేడెన్ సీల్స్
