టీ మిండియా మాజీ క్రికెటర్  హర్భజన్ సింగ్ బౌలింగ్ స్టైల్‌ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే...  ఇప్పుడు.. భజ్జీ స్టైల్ ని కోహ్లీ కాపీ కొట్టాడు. అచ్చం హర్భజన్ లా  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  అనుకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

శ్రీలంకతో జరిగిన రెండో టి 20 కి ముందు అతను ఈ విధంగా చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ని స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోకి ఇప్పుడు లక్షల్లో వ్యూస్... వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. 

AlsoReadరోహిత్ శర్మ లేకున్నా....: శ్రీలంకపై విజయం మీద కోహ్లీ స్పందన ఇదీ....

ఒకసారి అతని బౌలింగ్ యాక్షన్ చూస్తే, బౌలింగ్ వేసే ముందు బజ్జీ బాడీ లాంగ్వేజ్, బౌల్ మిస్ అయిన తర్వాత అతను నిరాశగా చేతులు పెట్టుకునే విధానాన్ని కాపీ చేసాడు విరాట్. హర్భజన్ మైదానంలో మ్యాచ్ గురించి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో అతను ఈ విధంగా బౌలింగ్ చేసాడు. దాని తర్వాత... భజ్జీ కూడా.. కోహ్లీని మైదనాంలో ఆలింగనం చేసుకున్నాడు. 

అయితే... ఈ వీడియోకి కామెంట్ల రూపంలోనూ స్పందన బాగా వస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున ఈ వీడియోని షేర్ చేస్తూ బజ్జీ లోటు ని విరాట్ తీర్చాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.