ముంబై: పరిమిత ఓవర్ల సిరీస్ ల్లో వెస్టిండీస్ ను మట్టి కరిపించిన టీమిండియా శ్రీలంక జట్టుతో తలపడబోతోంది. నూతన సంవత్సరంలో శ్రీలంక సిరీస్ లో కూడా తన దూకుడును కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. 

శ్రీలంక, ఇండియా మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడనున్నాయి. తొలి మ్యాచ్ గౌహితిలోని బర్సాపర స్టేడియంలో జనవరి 5వ తేదీన జరుగుతుంది.బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై 2-1 స్కోరుతో వరుస విజయాలు సాధించిన టీమిండియా జోరు మీద ఉంది.

మరోవైపు లసిత్ మలింగ నాయకత్వంలోని శ్రీలంక జట్టు పాకిస్తాన్ జట్టును 3-0 స్కోరుతో వైట్ వాష్ చేసిన ఊపు మీద ఉంది.  శ్రీలంక మాత్రం ఆల్ రౌండర్ అంజిలో మాథ్యూస్ ను తిరిగి జట్టులోకి తీసుకుంది. 

షెడ్యూల్

జనవరి 5: తొలి టీ20, బర్సపరా క్రికెట్ స్డేడియం, గౌహతి, రాత్రి 7 గంటలకు

జనవరి 7: రెండో టీ20, హోల్కార్ క్రికెట్ స్టేడియం, ఇండోర్, రాత్రి 7 గంటలకు

జనవరి 10: మూడో టీ20, మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే, రాత్రి 7 గంటలకు

ఇండియా జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శివం దూబే, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్

శ్రీలంక జట్టు: లసిత్ మలింగ (కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, అంజిలో మాథ్యూస్, దాసను షనక, కుశాల్ పెరేరా, నిరోషన్ డిక్ వెల్ల, ధనుంజయ డీ సిల్వ, ఇసురు ఉడానా, భానుక రాజపక్ష, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లహిర్ కుమార్, కుశాల్ మెండిస్, లక్షన్ సందకన్, కుసూన్ రజిత

శ్రీలంక, ఇండియా మధ్య జరిగే టీ20 సిరీస్ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రసారం చేస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లోనూ జియో టీవీ, ఎయిర్ టెల్ టీవీ వేదికల్లోనూ అందుబాటులో ఉంటాయి.