భారత్-శ్రీలంక మొదటి టీ20కి వర్షం ఆటంకం కలిగిస్తోంది. స్టేడియంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఇంకా ఆరంభం కాలేదు. కాగా భారత తుది జట్టులో కుల్‌దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.