INDvsSA ODI series: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపికైన వాషింగ్టన్ సుందర్... కరోనా పాజిటివ్‌గా తేలడంతో సఫారీ టూర్‌కి దూరం... జనవరి 19 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్...
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపికైన టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడ్డాడు. సఫారీ వన్డే సిరీస్‌కి ఎంపికైన భారత క్రికెట్ సభ్యులందరూ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ముంబై చేరుకుని, ప్రత్యేక ఛార్టెట్ ఫ్లైట్‌లో బుధవారం ఉదయం సౌతాఫ్రికా చేరుకోవాల్సి ఉంది...
అయితే వాషింగ్టన్ సుందర్‌కి చేసిన కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంగ్లాండ్ టూర్‌లో కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్, దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తమిళనాడు తరుపున విజయ్ హాజారే ట్రోఫీ 2021లో పాల్గొన్నాడు సుందర్...
విజయ్ హాజరే ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ కనబర్చిన పర్ఫామెన్స్ కారణంగా అతనికి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు. అయితే అతను ఇప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వాషింగ్టన్ సుందర్, సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లడం అనుమానంగానే మారింది...
వాషింగ్టన్ సుందర్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్ వంటి మరో ఇద్దరు స్పిన్నర్లకు కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం దక్కింది. అయితే అశ్విన్, చాహాల్‌లతో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టుకి బ్యాటుతోనూ ఉపయోగపడతాడు...
షెడ్యూల్ ప్రకారం జనవరి 19న మొదటి వన్డే, ఆ తర్వాత జనవరి 21న రెండో వన్డే మ్యాచులు పార్ల్ వేదికగా జరుగుతాయి. మూడో టెస్టు జరుగుతున్న కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జనవరి 23న ఆఖరి వన్డే మ్యాచ్ జరుగుతుంది...
ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ గాయపడడంతో బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆరంగ్రేటం చేశాడు వాషింగ్టన్ సుందర్. ఆసీస్ టూర్‌కి నెట్ బౌలర్‌గా ఎంపికైన వాషింగ్టన్ సుందర్, అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి మొదటి ఇన్నింగ్స్‌ల్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...
ఏడో వికెట్‌కి శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన్ సుందర్, బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ తీసిన మొదటి వికెట్ స్టీవ్ స్మిత్‌దే...
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 96 పరుగులతో అజేయంగా నిలిచిన వాషింగ్టన్ సుందర్, టీమిండియా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో సెంచరీ చేసే అద్భుత అవకాశాన్ని కోల్పోయాడు...
శ్రీలంకతో 2017లో జరిగిన మ్యాచ్‌లో వన్డే ఆరంగ్రేటం చేసిన వాషింగ్టన్ సుందర్, ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఏ ప్లేయర్‌ని రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించలేదు బీసీసీఐ. అలాగే రెండో టెస్టులో గాయపడిన మహ్మద్ సిరాజ్ కూడా వన్డే సిరీస్‌కి అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది...
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
