రాంచీ వేదికగా  దక్షిణాఫ్రికాతో టీం ఇండియా ఈరోజు మూడో టెస్టు లో పోరాడుతోంది. తొలి రెండు మ్యాచ్ లు ఇరగదీసిన టీం ఇండియా... ఈ మ్యాచ్ లో కాస్త చతికిలపడింది. ఈ సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

టీం ఇండియాతో జరుగుతున్న అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోతూనే ఉంది. దీంతో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి టాస్ వేసేటప్పుడు వేరేవాళ్లతో టాస్ వేయిస్తానని ఇటీవలే డుప్లెసిస్ పేర్కొన్నాడు. అతను చెప్పినట్లుగానే తాను కాకుండా తెంబ బవుమానుతో టాస్ వేయించాడు.

అయితే... వేరే వాళ్లతో వేయించినా కూడా దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోయింది. టీం ఇండియా టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే.. దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోగానే టీం ఇండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ నవ్వులు చిందించారు. మనిషిని మార్చినా... ఫలితం మారలేదు ఈ నేపథ్యంలోనే కోహ్లీ  తన నవ్వును ఆపుకోలేకపోయారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ సంగతి పక్కన పెడితే... టాస్ ఓడినా దక్షిణాఫ్రికా బౌలింగ్, ఫీల్డింగ్ ఇరగదీస్తోంది. ఇప్పటికే మూడు వికెట్లు తీసి... ముందుకుసాగుతుంది.