IND vs SA Test Match: కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇండియా, సౌతాఫిక్రాల మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. రెండు రోజు ఆట ముగించిన టీమిండియా త్వ‌ర‌గానే ఇన్నింగ్స్ ముగించాల్సి వ‌చ్చింది. 

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా – దక్షిణాఫ్రికా జట్ల తొలి టెస్ట్ సాగుతోంది. 37/1 స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 62.2 ఓవర్లలో ఇన్నింగ్స్ ముగించింది. మొత్తం స్కోర్ 189. దీంతో 30 పరుగుల ఆధిక్యం లభించింది.

టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోర్ అందించాడు. కాగా వాషింగ్టన్ సుందర్ – 29, రిషభ్ పంత్ – 27, రవీంద్ర జడేజా – 27 ప‌రుగులు సాధించారు. ఈ ముగ్గురికి మంచి ఆరంభం లభించినప్పటికీ పెద్ద స్కోర్‌గా మార్చుకోలేకపోయారు. యశస్వి జైస్వాల్ (12), ధ్రువ్ జురేల్ (14) నిరాశ పరిచారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ ఆధిక్యం దక్కించుకునే అవకాశం చేజారింది.

శుభ్‌మన్ గిల్‌కు గాయం

ఇన్నింగ్స్ మధ్యలో కీలక సమయంలో శుభ్‌మన్ గిల్‌కు గాయ‌మైంది. సైమన్ హార్మర్ వేసిన బంతిని స్వీప్ చేయబోయే ప్రయత్నంలో మెడ కండరాలు పట్టేయడంతో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. మూడు బంతులే ఎదుర్కొని రిటైర్డ్ హర్ట్‌గా మైదానం విడిచాడు. తిరిగి బ్యాటింగ్‌కు అందుబాటులో లేకపోవడం భారత ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపింది.

దక్షిణాఫ్రికా బౌలర్ల ఆధిక్యం

ప్రోటియాస్ బౌలర్లలో సైమన్ హార్మర్ 4 వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు. మార్కో జాన్సెన్ 3 వికెట్లు, కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ తలో వికెట్ సాధించారు.

కాగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ముందు 159 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఓపెనర్ మార్‌క్రమ్ 31 పరుగులతో టాప్ స్కోరర్. ముల్డర్ (24), రికెల్టన్ (23), డి జోర్జీ (24) కొంత ప్రతిఘటన ఇచ్చారు. కెప్టెన్ బవుమా 3 పరుగులకే వెనుదిరిగాడు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 5/27తో అద్భుత ప్రదర్శన చేశాడు. సిరాజ్ 2 వికెట్లు, కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.