Asianet News TeluguAsianet News Telugu

IND vs SA: 0 ప‌రుగుల‌కే 6 వికెట్లు.. ఘోరంగా విఫ‌ల‌మైన భార‌త బ్యాట‌ర్స్

India vs South Africa Test: కేప్ టౌన్ లో జ‌రుగుతున్న సౌతాఫ్రికా టెస్టులో భార‌త్ బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త తొలి ఇన్నింగ్స్  చివ‌రి 11 బంతుల్లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండా ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. 153 పరుగులకు ఆలౌట్ అయింది.  
 

India vs South Africa Test: India lose 6 wickets in 11 balls, fold for 153 after South Africa's 55 all out RMA
Author
First Published Jan 3, 2024, 8:21 PM IST

India vs South Africa 2nd Test: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్ సౌతాఫ్రికా టెస్టులో ఒకే రోజు రెండు జ‌ట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి చేయ‌డంతో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మ‌రీ ముఖ్యంగా తొలిరోజు ఇరు జ‌ట్ల బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. దీంతో ప‌రుగులు చేయ‌డానికి బ్యాట‌ర్స్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే, భార‌త్ మ‌రో చెత్త రికార్డును న‌మోదుచేసింది. భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 153 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

భారత జట్టులోని ఆరుగురు ప్లేయర్లు 0 పరుగులకే ఔట్ అయి చెత్త రికార్డును నమోదుచేశారు. మ్యాచ్ చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా భారత్ 6 వికెట్లను కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయని భారత ప్లేయర్లలో శ్రేయాస్ అయ్యార్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. 

భారత జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. మరోసారి ఒక్క పరుగు కూడా చేయకుండా యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యి మరోసారి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రోహిత్ శర్మ 39 పరుగులు, శుభ్ మన్ గిల్ 36 పరుగులు, విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించారు. 153 పరుగుల వరకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా ఫెవిలియన్ బాట పట్టడంతో అదే స్కోర్ వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది.

సౌతాఫ్రికా బౌలర్లలో కసిగో రబాడ, లుంగి ఎంగిడీ, నందే బర్గర్ లు తలా 3 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా జట్టు 53 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో రాణించాడు. ముఖేష్ కుమార్, బుమ్రాలు తలా 2 వికెట్లు తీసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios