జియో...ఈ పేరు టెక్నాలజీ రంగంలో పెను సంచలనం. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగంలో ఫెను సంచలనాలను సృష్టించిన జియో ఇప్పుడు మరిన్ని రంగాల్లోకి దూసుకెళ్లేందుకు సిద్దమైంది. సినిమా, టెలివిజన్ రంగాలతో పాటు క్రీడా రంగంలోకి తమ సేవలను విస్తృతం చేయడానికి రంగం సిద్దంచేసింది. ఈ క్రమంలోనే భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగే టీ20 సీరిస్ ను తమ వినియోగదారులకు ఉచితంగా అందించాలని జియో నిర్ణయించింది.

సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే మూడు టీట్వంటీ మ్యాచ్ ల సీరిస్ ను జియో టీవి ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఎలాంటి అదనపు  చార్జీలు వసూలు చేయబోమని జియో ప్రకటించింది. అంతేకాకుండా వివిధ ప్రాంతీయ బాషల కామెంటరీతో ఈ  మ్యాచ్ లను వీక్షించే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఎప్పటిలాగే హిందీ, ఇంగ్లీష్ బాషలతో పాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ బాషల కామెంటరీతో మ్యాచ్ ప్రసారాలు  జరగనున్నాయి. ఇందుకోసం అధికారిక ప్రసారదారులైన స్టార్ ఇండియాతో జియో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  

ఈ  సదుపాయం జయో టీవి  యాప్ ను కలిగిన వినియోగదారులే పొందవచ్చు. ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ల ద్వారా వినియోగదారులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా తీసుకువచ్చిన జియో క్రికెట్ హెచ్‌డి ఛానల్లో కూడా ఇండియా-సపారీల పోరును ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.