టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఓపెనర్ గా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ... మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో రోహిత్ శర్మ 212 పరుగులతో డబల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

కాగా... ఒక టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్ లో నమోదు చేసిన స్కోరుకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆల్ అవుట్ అయితే... రెండో ఇన్నింగ్స్ లో 133లో పెవిలియన్ కి చేరారు. దాంతో రోహిత్ చేసిన పరుగులన్నీ కూడా సఫారీలో తమ ఇన్నింగ్స్ లో సాధించలేకపోయారు. 

అంతకుముందు ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వినూ మన్కడ్‌(231-న్యూజిలాండ్‌పై) తొలిసారి ఈ మార్కును చేరగా, ఆపై రాహుల్‌ ద్రవిడ్‌(270- పాకిస్తాన్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. ఒక మూడు స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌(248-బంగ్లాదేశ్‌పై), నాల్గో స్థానంలో విరాట్‌ కోహ్లి(243-శ్రీలంకపై)లు ఉన్నారు.

ఇదిలా ఉండగా....  రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సఫారీలపై ఘనవిజయం సాధించి  భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. దీంతో  3-0తో సిరీస్‌ని క్లీన్ స్విప్ చేసింది.

విశాఖలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఆ తర్వాత పుణె టెస్టులోను , 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా రాంచీ టెస్ట్‌లోను  తన సత్తా చాటి మరో సారి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో  నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలురెండు ఓవర్లలోనే ఆలౌటయ్యారు. భారత బౌలర్ నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో  రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది .

నోర్జెతో కలిసి బ్యాటింగ్ దిగిన  డిబ్రుయిన్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌ లోని రెండో ఓవర్‌లో నదీమ్‌ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఎంగిడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

తొలి బంతినే అతడు షాట్‌ ఆడాలని  ప్రయత్నించి ఔటయ్యాడు. అతను కొట్టిన షాట్  బంతి నేరుగా వెళ్లి అవతల ఎండ్‌లో ఉన్న నోర్జెకి  తగిలింది. దీంతో ఆ బంతి గాల్లోకి ఎగిరడంతో దాన్ని నదీమ్‌  క్యాచ్‌ పట్టడంతో సఫారీల  కథ ముగిసిపోయింది.సఫారీలతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి నయా రికాడ్డును సృష్టించింది. ఈ  సిరీస్‌ గెలుపుతో టెస్ట్‌ల్లో తనుకుతిరుగులేదని నిరూపించుకుంది. టెస్టు ఫార్మాట్‌లో  టీమిండియాపై  దక్షిణాఫ్రికాదే పైచేయి ఉండగా  స్వదేశంలో జరిగే టెస్టుల్లో మాత్రం టీమిండియాదే పైచేయి..