Asianet News TeluguAsianet News Telugu

కేప్ టౌన్ టెస్టుపై ఐసీసీ గ‌రం గ‌రం.. న్యూలాండ్స్‌ పిచ్‌కు డీమెరిట్ పాయింట్ !

Newlands Test pitch: భార‌త్-సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్టు వేదిక కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్ పై బ్యాటింగ్ చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్‌ బ్రాడ్‌ నివేదిక నేప‌థ్యంలో ఐసీసీ యాక్ష‌న్ తీసుకుంటూ గ‌రం గ‌రం అయింది. 
 

India vs South Africa: Newlands Test pitch receives 'unsatisfactory' rating, icc Cape Tout Chris Broad RMA
Author
First Published Jan 9, 2024, 5:17 PM IST

India vs South Africa - Cape Town: భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ప్రఖ్యాత కేప్ టౌన్ టెస్టు వేదిక‌గా ఉన్న న్యూలాండ్స్ పిచ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గ‌రంగ‌రం అయింది. కేవ‌లం రెండు రోజుల్లో టెస్టు మ్యాచ్ అయిపోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. పిచ్ తీరుపై అసంతృప్తిని వ్య‌క్తి చేసింది. పిచ్ విపరీతమైన సీమ్ అనుకూలంగా వుండ‌టంతో టెస్టు మొదటి రోజు 23 వికెట్లు పడిపోయాయి.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 55 పరుగులకే ఆలౌటవ్వడంతో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. అదే రోజు భారత్ ను 153 పరుగులకే ఆలౌట్ చేసిన ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ దిగి మూడు వికెట్లు కోల్పోయింది. ఇక రెండో రోజు లంచ్ టైం లోపే ఆలౌట్ అయింది. 79 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండు రోజుల్లో టెస్టు మ్యాచ్ ముగియ‌డంతో హాట్ టాపిక్ అయింది.

T20 WORLD CUP 2024: రోహిత్, కోహ్లీల రాక‌తో భారత్‌కు మరో ప్రపంచకప్‌ ఖాయమా?

ఈ మ్యాచ్ కు రిఫ‌రీగా వ్య‌వ‌హ‌రించిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పిచ్ గురించి రిపోర్టు అందించ‌డంతో ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంది. న్యూలాండ్స్ పిచ్ కు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ.. 'న్యూలాండ్స్ లోని పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. మ్యాచ్ అంతటా బంతి వేగంగా, కొన్నిసార్లు ప్రమాదకరంగా దూసుకెళ్లడంతో షాట్లు ఆడటం కష్టంగా మారింది. ఇబ్బందికరమైన బౌన్స్ కారణంగా చాలా మంది బ్యాట్స్ మ‌న్ బ్యాటింగ్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డారు. గ్రౌండ్ లో ఎక్కువ సేపు ఉండ‌లేక‌పోయారని పేర్కొన్నాడు.

ఐసీసీ పిచ్ అండ్ ఔట్ ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ప్రకారం ఒక నిర్దిష్ట వేదిక నాసిరకంగా రేటింగ్ ఇస్తే దానికి డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ)కు 14 రోజుల గడువు ఉంది. కాగా, ఇరు జ‌ట్ల కెప్టెన్లు డీన్ ఎల్గర్, రోహిత్ శర్మలు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తో ఇప్ప‌టికే పిచ్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పిచ్ ప్రమాణాల కంటే తక్కువగా ఉందని ఇద్దరు కెప్టెన్లు తన నివేదికలో పేర్కొన్నారు.

దేశం గర్వపడేలా కృషి చేస్తా.. రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నమహ్మద్ షమీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios