దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ కి టీం ఇండియా సిద్ధమయ్యింది. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే టీమిండియా మొదటి టెస్టు గెలిచి... 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ కూడా గెలిస్తే.. సిరిస్ భారత్ సొంతమౌతుంది. సిరీస్ ని దక్కించుకోవాలనే టీం ఇండియా ఆశిస్తుంటే... ఈ మ్యాచ్ అయినా గెలవాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. 

మొన్న జరిగిన వైజాగ్ టెస్టులో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. 303 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే... మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక అశ్విన్, మహ్మద్ షమీ, జడేజా, ఇషాంత్ శర్మ... వికెట్ల వేటలో దుమ్ము రేపారు. ఇప్పుడు వీళ్లంతా సెకండ్ టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.

సౌతాఫ్రికా మాత్రం రెండో టెస్టును గెలిచి... సిరీస్ సమం చెయ్యాలని ప్రయత్నిస్తోంది. టీ-20లో సిరీస్ సమం చేసి... టీమిండియాను నిరాశ పరిచిన సఫారీలు... టెస్టు సిరీస్‌లోనూ అలాగే చెయ్యాలని భావిస్తున్నారు. ఐతే... మొదటి టెస్టు గెలవడంతో... భారత జట్టులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. అందువల్ల మన జట్టును ఢీ కొట్టే విషయంలో సఫారీలు ప్రస్తుతం అంత బలంగా లేరనే చెప్పొచ్చు. మొన్నటి మ్యాచ్ ఎఫెక్ట్ తో.. ఇప్పుడు కూడా అందరి దృష్టి.. రోహిత్ శర్మపైనే ఉంది.