మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోపీలో భాగంగా భారత్-సౌతాఫ్రికాలు విశాఖపట్నంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అక్టోబర్ 2 బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో సఫారీ టీంను బెంబేలెత్తిస్తున్నాడు. ఇలా మొదటి రోజు మొత్తం టీమిండియా బ్యాట్స్‌మెన్స్ హవా కొనసాగగా అది రెండో రోజు  కూడా కొనసాగింది. అయితే ఇదేరోజు చివర్లో భారత బౌలర్ల హవాకూడా మొదలయ్యింది. 

ఆతిథ్య భారత్ 502/7 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి సౌతఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. అయితే భారత ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిన పిచ్ పైనే సఫారీ ఆటగాళ్ళు తడబడుతున్నారు. ఓపెనర్ మక్రమ్ (5 పరుగులు), డి బ్రూన్ (4 పరుగులు) కనీసం సింగిల్ డిజిట్ పరుగులయినా సాధించి ఔటయ్యారు. కానీ డి బ్రూన్ మాత్రం పరుగులేమీ సాధించకుండానే డకౌటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా కేవలం 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. మరో ఓపెనర్ ఎల్గర్ 27 పరుగులతో పోరాడుతుండగా బవుమా 2 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 

సఫారీ జట్టు కోల్పోయిన మూడు వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి చేరాయి.  సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్  కు 2 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 1  వికెట్ దక్కింది. ఇలా మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా చేతిలో ఇంకా 7 వికెట్లు వుండగా 463 పరుగులు వెనుకబడివుంది.  

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ సెంచరీ(176 పరుగులు), మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ(215 పరగులు)తో విజృంభించారు. దీంతో కోహ్లీసేన 502 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. కోహ్లీసేన బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా రాణిస్తుండటంతో మ్యాచ్ పై మరింత పట్టు సాధిస్తోంది.