దక్షిణాఫ్రికా జరుగుతున్న మూడో టెస్టులో టీం ఇండియాకు షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రబాడా వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డీన్ ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీం ఇండియా 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌గా చతేశ్వర్‌ పుజారా ఔటయ్యాడు. దాంతో  భారత్‌ జట్టు 16 పరుగులకు రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. 

భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా రబడా వేసిన ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి అగర్వాల్‌ ఔటయ్యాడు. రబడా కాస్త స్వింగ్‌ అయ్యేలా వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్‌ థర్డ్‌ స్లిప్‌లో ఉన్న ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 

రబడా వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా.. తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు.  తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను రబడా సాధించి దక్షిణాఫ్రికా బ్రేక్‌ ఇచ్చాడు. ఇదిలా ఉండగా... మయాంక్ అగర్వాల్ విశాఖ టెస్టులో ద్విశతకంతో  చెలరేగగా.. పూణె టెస్టులో సెంచరీ చేశాడు.. మూడో టెస్టులో తుదిలో పెవిలియన్ కి చేరాడు.