Asianet News TeluguAsianet News Telugu

మూడో టెస్టు.. బ్యాడ్ లక్... కోహ్లీ కూడా ఔట్

 ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దాంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. అది లెగ్‌ స్టంప్‌ బెయిల్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించింది.  దాంతో  ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో ఔట్‌గా ప్రకటించారు. 
 

India vs South Africa 3rd Test  India 71/3 at lunch against south africa
Author
Hyderabad, First Published Oct 19, 2019, 12:16 PM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీం ఇండియాకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే మయాంక్ అగర్వాల్, పుజారాలు ఔట్ కాగా... ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఔట్ అయ్యాడు. తన ఎల్బీ నిర్ణయంపై రివ్యూ కోరిన విరాట్‌ కోహ్లి..చివరకు ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌తో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.  

భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా అనిరిచ్‌ నోర్త్‌జే వేసిన 16 ఓవర్‌ మూడో బంతిని కోహ్లి షాట్‌ కొట్టబోయాడు.  ఆ బంతి కాస్తా మిస్‌ అయ్యి కోహ్లి ప్యాడ్లను ముద్దాడింది. దీనికి దక్షిణాఫ్రికా జట్టు బిగ్గరగా అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. కాకపోతే రోహిత్‌ శర్మతో చర్చించిన తర్వాత కోహ్లి రివ్యూకు వెళ్లాడు.

కాగా, ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దాంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. అది లెగ్‌ స్టంప్‌ బెయిల్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించింది.  దాంతో  ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో ఔట్‌గా ప్రకటించారు. 

ఇక చేసేది లేక కోహ్లి భారంగా పెవిలియన్‌ వీడాడు. ఒకవైపు సఫారీలు సంబరాలు చేసుకుంటే కోహ్లి మాత్రం పూర్తి అసంతృప్తితో మైదానం విడిచాడు. భారత్‌ జట్టు 39 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజరా(0)లు నిరాశపరిచారు. వీరిద్దరూ రబడా బౌలింగ్‌లో ఔటయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios