Tilak Varma: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో తిలక్ వర్మ అర్ధసెంచరీ బాదాడు. నాలుగో వన్డే ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటివరకు 15 టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. 

India vs South Africa 3rd ODI: గురువారం పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ తిలక్ వర్మ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఎడమచేతి వాటం ఆటగాడు తన నాలుగో వ‌న్డే మ్యాచ్ లో త‌న తొలి ఆఫ్ సెంచ‌రీని సాధించాడు. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్ ల‌ను ఆడిన తిల‌క్ వ‌ర్మ‌.. రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్‌లో నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 75 బంతుల్లో తన తొలి ఫిఫ్టికి చేరుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred