Asianet News TeluguAsianet News Telugu

IND vs SA 2nd Test: భారత్ vs సౌతాఫ్రికా రెండో టెస్టు.. వ‌ర్షం విల‌న్ కానుందా.. !

IND vs SA 2nd Test: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. అయితే, ఈ టెస్టు మ్యాచ్ కు వ‌ర్షం విల‌న్ కానుంది. మ్యాచ్ తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం లేదు కానీ, కీల‌క‌మైన నాలుగు, ఐదో రోజు వ‌ర్షం కురిసే అవకాశ‌ముంది.
 

india vs south africa 2nd Test: Rain Likely to Washout Day 4, 5 Of Newlands, Cape Town Test Weather Forecast RMA
Author
First Published Jan 2, 2024, 10:04 AM IST

India vs South Africa 2nd Test: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. సెంచూరియన్ లో ఘోర పరాజయాన్ని చ‌విచూసిన భార‌త్.. ఆ ఓట‌మిని పూడ్చుకోవాలని చూస్తున్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండో టెస్టులో విజ‌యం సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండో టెస్టుపై వర్షం దెబ్బ ప‌డనుంద‌ని స‌మాచారం.  భార‌త్-ద‌క్షిణాఫ్రికా రెండో టెస్టు ప్రారంభం నుంచి మూడు రోజుల పాటు వాతావార‌ణం అనుకూలంగానే ఉంటుంది కానీ, ఆ త‌ర్వాత మ్యాచ్ పై ప్ర‌భావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

భార‌త్-ద‌క్షిణాఫ్రికా రెండో టెస్టుపై వ‌ర్షం దెబ్బ‌

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు వ‌ర్షం విల‌న్ కానుందా? అంటే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. టెస్టు మ్యాచ్ తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం లేదు కానీ, కీల‌కంగా ఉండే నాలుగు, ఐదో రోజుల్లో  కేప్ టౌన్ లో వ‌ర్షం కురిసే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. నాలుగో రోజు వర్షం పడే అవకాశాలు 40 నుంచి 50 శాతం ఉండగా, టెస్టు చివరి రోజు వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 

కేప్ టౌన్ టెస్టులో రోహిత్ శ‌ర్మ‌ అద్భుతం చేస్తాడా? తొలి భారత కెప్టెన్ గా స‌రికొత్త రికార్డే.. !

కేప్ టౌన్ న్యూలాండ్ పిచ్ ఎలా ఉంటుంది..? 

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదిక‌గా జ‌రిగే మ్యాచ్ లో ఇరు జ‌ట్లు మ్యాచ్ ను గెల‌వాల‌ని భావిస్తున్నాయి. ఈ గ్రౌండ్ పిచ్ ఎలా ఉంటుంద‌నేది గ‌మ‌నిస్తే... న్యూలాండ్స్ మైదానంలో ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యం స్ప‌ష్టంగా ఉంటుంది. పిచ్ నుంచి బౌన్స్ సాయంతో ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టిస్తారు. అందుకే ఈ మైదానంలో చాలా తక్కువ టెస్టు మ్యాచ్ ల ఫలితం డ్రా గానే వ‌స్తుంది. ఇక బ్యాట‌ర్స్ కు అయితే, అస‌లైన ప‌రీక్ష అనే చెప్ప‌లి. ఈ గ్రౌండ్ లో ప‌రుగులు చేయ‌డానికి బ్యాట‌ర్స్ చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

గ‌త గణాంకాలు ఏం చెబుతున్నాయి?

కేప్ టౌన్ లోని ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 60 టెస్టు మ్యాచ్లు జరగ్గా, అందులో 23 మ్యాచ్ ల‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. అదే సమయంలో ఫీల్డ్ ఛేజింగ్ జట్టు 25 మ్యాచ్ ల‌లో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 325, రెండో ఇన్నింగ్స్ లో 292, మూడో ఇన్నింగ్స్ లో 234, నాలుగో ఇన్నింగ్స్ లో 163 ప‌రుగుల‌ సగటు స్కోరు నమోదైంది. అంటే నాలుగో ఇన్నింగ్స్ లో పరుగులు చేయ‌డానికి బ్యాట‌ర్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది.

శివాజీ పెద్ద కొడుకు కష్టం వృధా.. బిగ్ బాస్ ఓడిపోయిన దానికంటే అదే పెద్ద బాధ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios