మొహాలీ  వేదికన జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే కోహ్లీసేన ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 52 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడికి ఓపెనర్ శిఖర్ ధవన్ (40 పరుగులు)చక్కటి సహకారం అందించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 12, రిషబ్ పంత్ 4 పరుగులకే ఔటై మరోసారి నిరాశపర్చారు.   

అంతకు ముందు సపారీలను తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.  సౌతాఫ్రికా జట్టుకు ఆరంభం అదిరినా చివరివరకు ఈ ఊపును కొనసాగించలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 

భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2, జడేజా 1, సైనీ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. సఫారీ ఆటగాళ్లలో  కెప్టెన్ డికాక్ హాఫ్ సెంచరీ సాధించాడు. బవుమా 49 పరుగుల వ్యక్తిగత స్కోరు  వద్ద ఔటై హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు. వీరిద్దరి జోడి నెలకొల్పిన భాగస్వామ్యం వల్లే సౌతాఫ్రికా 149 పరుగులు చేసి  భారత్ కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. 

భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు  క్యూ కట్టారు.దీపక్ చాహర్ బౌలింగ్ లో బవుమా(49 పరుగుల) నాలుగో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఆ వెంటనే హర్దిక్ పాండ్యా బౌలింగ్ లో మిల్లర్(18 పరుగులు) ఔటయ్యాడు.  

 అంతకుముందు సౌతాఫ్రికా టీం  వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ(52 పరుగులు) తో అదరగొట్టిన కెప్టెన్ డికాక్ ను సైనీ 88 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాతి  ఓవర్లోనే జడేజా డస్సెస్(1 పరుగు) బలితీసుకున్నాడు. ఓపెనర్ హెన్రిక్స్ కేవలం 6 పరుగుల వద్ద చాహర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.   

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి.

తుది జట్లివే

భారత్; 

రోహిత్ శర్మ,  శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా,  రవీంద్ర జడేజా,  వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్,నవదీప్ సైనీ, 
 
సౌతాఫ్రికా:

క్వింటన్ డికాక్, హెన్రిక్స్, బవుమా, వాండర్  డస్సెన్, డేవిడ్ మిల్లర్,  ప్రిటోరియస్, ఫెహ్లుక్వాయో, ఫార్చ్యూన్, రబడ, నాట్జె, శంషీ