మళ్లీ అదే సీన్! ఓపెనర్లు అట్టర్ ఫ్లాప్... 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా...
10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా... సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. షాహీన్ ఆఫ్రిదీ వేసిన తొలి ఓవర్‌లో 5 పరుగులు రాగా నసీం షా వేసిన రెండో ఓవర్‌లో వికెట్లు మీదకి ఆదుకుని పెవిలియన్ చేరాడు కెఎల్ రాహుల్...
కెఎల్ రాహుల్ 8 బంతుల్లో 4 పరుగులు చేసి బౌల్డ్ కావడంతో 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిదీ వేసిన రెండో ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. 4వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హారీస్ రౌఫ్, రోహిత్ శర్మ వికెట్ తీశాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఇఫ్తికర్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. 4 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది టీమిండియా. పాక్ విధించన 160 పరుగుల లక్ష్యానికి ఇంకా 143 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు... వస్తూనే రెండు ఫోర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్, 10 బంతుల్లో 15 పరుగులు చేసి హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లో మొదటి బంతికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
15 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది పాకిస్తాన్. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది పాకిస్తాన్. అశ్విన్ వేసిన 11 వ ఓవర్‌లో సిక్సర్ బాదిన ఇఫ్తికర్ 10 పరుగులు రాబట్టగా అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్‌లో 3 సిక్సర్లతో 21 పరుగులు రాబట్టాడు ఇఫ్తికర్ అహ్మద్...
మూడో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇఫ్తికర్ అహ్మద్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
అదే ఓవర్ 4 బంతుల్లో 2 పరుగులు చేసిన హైదర్ ఆలీ కూడా హార్ధిక్ పాండ్యా ఓవర్‌లో ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 91/2 వద్ద ఉన్న పాకిస్తాన్ స్కోరు, 10 బంతుల వ్యవధిలో 98/5కి చేరుకుంది...
హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన మహ్మద్ నవాజ్, 9 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చిన హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు... 3 బంతుల్లో 2 పరుగులు చేసిన అసిఫ్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.