Asianet News TeluguAsianet News Telugu

India vs Pakistan: టీమిండియాకి ఊహించని షాక్... రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అవుట్...

T20 worldcup 2021: రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్... కెఎల్ రాహుల్ 3 పరుగులకే అవుట్... 11 పరుగులకే సూర్యకుమార్ యాదవ్...

India vs Pakistan: Team India lost openers KL Rahul and Rohit Sharma too early
Author
India, First Published Oct 24, 2021, 7:53 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ఊహించని షాక్ తగిలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై పెద్దగా రికార్డు లేని రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రిదీ వేసిన రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

పాక్‌పై టీ20 వరల్డ్‌కప్ మ్యాచుల్లో డకౌట్ అయిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. 2007, 2012 టోర్నీల్లో గౌతమ్ గంభీర్ డకౌట్ కగా, రోహిత్ శర్మ దుబాయ్‌లో డకౌట్ అయ్యాడు... దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, ఆశీష్ నెహ్రా, సురేష్ రైనా తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

ఆ తర్వాత బీభత్సమైన ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌ను కూడా షాహీన్ ఆఫ్రిదీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మూడో ఓవర్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.  8 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 11 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, హసన్ ఆలీ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5.4 ఓవర్లలోనే 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

సూర్యకుమార్ యాదవ్ వికెట్‌తో టీ20ల్లో 100 క్యాచులు పూర్తిచేసుకున్నాడు పాకిస్తాన్ వికెట్ కీపర్ రిజ్వాన్... పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు...

Follow Us:
Download App:
  • android
  • ios