నవ్వు ఆపుకోలేకా? ప్రెషర్ ఆ! ఎమోషనల్ అయ్యాడా... జాతీయ గీతాలాపన సమయంలో రోహిత్ వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జాతీయ గీతాలాపాన సమయంలో రోహిత్ ఫేస్‌లో వింత ఎక్స్‌ప్రెషన్స్...
మొట్టమొదటిసారిగా కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్నాడు భారత సారథి రోహిత్ శర్మ. 2007 నుంచి ప్రతీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఉన్న రోహిత్, గత ఏడాది విరాట్ కోహ్లీకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రోహిత్ సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడుతోంది. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండడంతో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథిపై ఈసారి ప్రెషర్ చాలా ఎక్కువగానే ఉంది...
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే జాతీయ గీతాలాపన సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా వింతగా అనిపించాయి.నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కాస్త ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టు కనిపించిన రోహిత్, చివర్లో కళ్లు బిగ్గరగా మూసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడా? లేక ప్రెషర్ తట్టుకోలేక ఇలా చేశాడా? లేక నవ్వు ఆపుకోలేక ఈ విధంగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడా? అనేది అభిమానులకు అర్థం కావడం లేదు...
రోహిత్ శర్మ ఎందుకు అలా చేశాడా? మ్యాచ్ ముగిసిన తర్వాత అతనే స్వయంగా చెప్పేదాకా తెలీదు. అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం ఎవరికి తోచినట్టు వాళ్లు కథనాలు అల్లుకుంటున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్, భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే చేయగలిగింది. అది కూడా వైడ్ రూపంలో వచ్చింది..
రెండో ఓవర్‌లో మొదటి బంతికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అదే ఓవర్ ఐదో బంతికి షాన్ మసూద్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆఖరి బంతికి ఫోర్ బాదిన మహ్మద్ రిజ్వాన్, స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు...
టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు బాబర్ ఆజమ్. బాబర్ ఆజమ్‌కి ఇది ఐదో డకౌట్ కాగా షాహీన్ ఆఫ్రిదీ 4 సార్లు, మహ్మద్ రిజ్వాన్ 3 సార్లు డకౌట్ అయ్యారు.