ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్... హారీస్ రౌఫ్‌కి గాయం, బౌలింగ్‌కి దూరం...
Asia Cup 2023: వర్షం కారణంగా రిజర్వు డేన గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన ఆట.. గాయంతో బౌలింగ్‌కి దూరంగా హారీస్ రౌఫ్..
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో భాగంగా కొలంబోలో జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. దాదాపు 24 గంటల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కొలంబోలో కురుస్తున్న వర్షాల కారణంగా మొదటి రోజు 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత జట్టు, రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది...
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ కడుపు నొప్పితో బాధపడుతుండడంతో నేడు బౌలింగ్ చేయడం లేదని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలియచేశాడు. ‘హారీస్ రౌఫ్ నిన్న రాత్రి కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. స్కానింగ్‌లో అతనికి కొద్దిగా వాపు వచ్చినట్టు తేలింది. వరల్డ్ కప్ దగ్గర్లో ఉన్న కారణంగా ముందు జాగ్రత్తగా అతను ఈ రోజు బౌలింగ్ చేయడం లేదు. అతను వేయాల్సిన ఓవర్లను మిగిలిన బౌలర్లతో పూర్తి చేయిస్తాం... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టు, 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట వీలుకాకపోవడంతో మ్యాచ్‌ని రిజర్వు డేకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. నేడు కూడా కొలంబోలో వర్షం కురవడంతో ఆలస్యంగా ప్రారంభమైంది మ్యాచ్..
అయితే నిన్న సగం ఓవర్లు పూర్తి అయిన కారణంగా 50 ఓవర్ల పాటు మ్యాచ్ సాగనుంది. మరోసారి వర్షం అంతరాయం కలిగిస్తే మాత్రం ఓవర్లు కోల్పోవాల్సి ఉంటుంది. తొలి రోజు 5 ఓవర్లు బౌలింగ్ చేసిన హారీస్ రౌఫ్ 27 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ 50 ఓవర్ల పాటు సాగుతుండడంతో హారీస్ రౌఫ్ కోటాలో మిగిలిన 5 ఓవర్లను పార్ట్ టైమ్ బౌలర్‌తో వేయించాల్సి ఉంటుంది.
ఆల్‌రౌండర్ ఇఫ్తికర్ అహ్మద్‌తో హారీస్ రౌఫ్ కోటా పూర్తి చేయించే అవకాశం ఉంది. ఇఫ్తికర్ అహ్మద్‌కి మూడు ఫార్మాట్లలో కలిపి 14 వికెట్లు ఉన్నాయి.
నిన్న ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకున్న పాకిస్తాన్, రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత మిగిలి ఉన్న రివ్యూని వాడేసింది. నసీం షా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ కోసం అప్పీల్ చేశాడు మహ్మద్ రిజ్వాన్. డీఆర్‌ఎస్ కోసం కెప్టెన్‌ని ఒప్పించాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, కోహ్లీ ప్యాడ్స్‌కి తగులుతూ వెనక్కి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది.
28 ఓవర్లలో రెండు రివ్యూలను కోల్పోయింది పాకిస్తాన్.