Asianet News TeluguAsianet News Telugu

ఐర్లాండ్ టూర్‌లోనూ టీమిండియాని వదలని వరుణుడు... టాస్ గెలిచిన హార్ధిక్ పాండ్యా...

వర్షం కారణంగా ఆలస్యమైన టాస్... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు!  టీమిండియా ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్న ఉమ్రాన్ మాలిక్... 

India vs Ireland 1st T20 toss delay due to rain, Umran Malik making Team India debut
Author
India, First Published Jun 26, 2022, 8:42 PM IST

ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ఆడాల్సిన మొదటి టీ20 మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. టాస్ సమయానికి ముందు నుంచే వర్షం కురుస్తూ ఉండడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది... టాస్ తర్వాత కూడా వర్షం కురవడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఫలితాన్ని తేలకుండా చేసిన వరుణుడు, ఐర్లాండ్‌లో ప్రత్యేక్షం కావడం విశేషం. సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో టీ20 సిరీస్‌ 2-2 తో డ్రాగా ముగిసింది. 

 నేటి మ్యాచ్ ద్వారా హార్ధిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్‌గా కెరీర్ మొదలెడుతున్నాడు. ఈ ఏడాది టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఐదో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. ఒకే ఏడాదిలో ఐదుగురు కెప్టెన్లు మారడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో కేప్‌టౌన్ టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, ఆ మ్యాచ్ తర్వాత కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టూర్‌లో వన్డే సిరీస్‌కి కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వెస్టిండీస్, శ్రీలంక సిరీస్‌లు ఆడింది భారత జట్టు... ఆ తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్సీలో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడగా, తాజాగా హార్ధిక్ పాండ్యా, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు... 

అంతకుముందు ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్, నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపికైన ఉమ్రాన్ మాలిక్, అక్కడ ఆరంగ్రేటం చేయలేకపోయాడు... ఐపీఎల్ 2022 సీజన్‌లో 150+ కి.మీ.ల వేగంతో నిప్పులు చెదిరే బంతులతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్‌లతో బౌలింగ్ పంచుకోబోతున్నాడు..

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి తొలిసారి పిలుపు దక్కించుకున్న రాహుల్ త్రిపాఠి మాత్రం ఆరంగ్రేటం కోసం మరికొొంత కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. రాహుల్ త్రిపాఠితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కి తుది జట్టులో చోటు కల్పించలేదు టీమిండియా... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరమైన దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. యజ్వేంద్ర చాహాల్‌తో పాటు అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ యూనిట్‌ని నడిపించబోతున్నాడు. 

భారత జట్టు ఇది: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్

ఐర్లాండ్ టీమ్ తరుపున కోనోర్ ఓల్ఫర్ట్ నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. 

ఐర్లాండ్ జట్టు ఇది: పాల్ స్టిర్లింగ్, అండ బాల్బీరిన్, గారెత్ డెలనీ, హారీ టెక్టర్, లోర్కన్ టక్కర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రియిన్, క్రెగ్ యంగ్, జోష్ లిటిల్, కోనర్ ఓల్ఫర్ట్


 

Follow Us:
Download App:
  • android
  • ios