ఆస్ట్రేలియాతో.. టీమిండియా టెస్టు సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ టెస్టు సిరీస్ సమయంలో.. యువ క్రికెటర్ నటరాజన్ అదరగొట్టాడు. ఆ సమయంలో నటరాజన్ పేరు బాగా వినపడింది. అయితే.. ఆ తర్వాత గాయపడటంతో.. స్వదేశానికి వచ్చిన తర్వాత  ఇంగ్లాండ్ తో ఆడేందుకు ఎంపిక కాలేదు. అయితే.. ఇప్పుడు నటరాజన్ గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో.. అతనికి వన్డే జట్టులో చోటు కల్పించారు.

వన్డే జట్టులో చోటు దక్కడం పట్ల నటరాజన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు. 'మనకు నచ్చిన జాబ్‌లో ఉంటే జీవితంలో ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండలేం.. చాలా రోజుల తర్వాత బ్లూ జెర్సీ వేసుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అంటూ కామెంట్‌ చేశాడు. 

 

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు నటరాజన్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిద్ద కృష్ణ కూడా తుది జట్టులోకి ఎంపికయ్యారు. కాగా ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున 16 వికెట్లతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని అందరి ప్రశంసలు పొందాడు.