ఇంగ్లాండ్‌తో మొతేరా స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టుకి ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన స్టేడియంగా, అత్యాధునిక వసతులతో మొతేరా సర్దార్ వల్లభాయ్ స్టేడియాన్ని పునర్మించిన విషయం తెలిసిందే...

దాదాపు 10 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కాబోతున్న మొతేరా స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. మ్యాచ్ ప్రారంభానికి వచ్చేయాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా ఆహ్వానం పంపినట్టు సమాచారం.

బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాని రాక గురించి ఇంకా క్లారిటీ రాకపోయినా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మూడో టెస్టు ఆరంభవేడుకలకు హాజరు అవుతారని సమాచారం. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు అమిత్ షా, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జే షా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.