Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: మా మాస్ట‌ర్ ప్లాన్ అదే.. మన బౌల‌ర్ల‌ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది : రోహిత్ శ‌ర్మ

India vs England : భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్‌లో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా తిరుగులేని విజ‌యం సాధించింది. 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి టెస్ట్ క్రికెట్ లో పరుగుల పరంగా భారత్ త‌న అతిపెద్ద విజ‌యాన్ని న‌మోదుచేసింది.
 

India vs England : That's our master plan.. Proud to see our bowlers: Rohit Sharma RMA
Author
First Published Feb 18, 2024, 8:08 PM IST

India vs England : రాజ్‌కోట్‌లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తూ ఇంగ్లాండ్ ను మ‌ట్టి క‌రిపించింది. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రాజ్ కోట్ వేదిక‌గా  మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్ అతిపెద్ద విజ‌యం సాధించింది.

యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో 214 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర‌ జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో మ్యాచ్ ప్రారంభం అయిన అర‌గంట‌లోనే భార‌త్ 3 వికెట్లు కోల్పోయిన క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మంచి ఇన్నింగ్స్ తో టీమిండియా భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.  రాజ్‌కోట్ టెస్టు విజయం తర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ తన మాస్టర్ ప్లాన్‌ను గురించి మాట్లాడాడు. ఈ క్ర‌మంలోనే భార‌త ఆటగాళ్లపై ప్ర‌శంస‌లు కురిపించాడు.

IND VS ENG: ఇంగ్లాండ్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన భార‌త్.. జడేజా విశ్వరూపం.. !

రాజ్‌కోట్ లో భార‌త్ విజయం తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భార‌త స్టార్ ఆల్ రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా, యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్, ఈ టెస్టు మ్యాచ్ తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ లను ప్రశంసించాడు.  "టెస్టు క్రికెట్‌ ఆడుతున్నప్పుడు రెండు, మూడు రోజులు కాదు.. ఐదు రోజుల గురించి ఆలోచిస్తా. మంచి షాట్లు ఆడి వారిని ఒత్తిడిలో ఉంచాం. మా బౌలింగ్ బలంగా ఉంది, ఓపికగా ఉండి ప్రశాంతంగా ఆడాలని జట్టును కోరాను, అందుకే ఈ విజయం సాధించామ‌ని" రోహిత్ శ‌ర్మ తెలిపాడు.

అలాగే, రాజ్ కోట్ టెస్టు ద్వారా భార‌త్ త‌ర‌ఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ గురించి కూడా రోహిత్ శర్మ మాట్లాడాడు. "స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సత్తా మనకు తెలుసు. బ్యాటింగ్‌కు వచ్చే ముందు అతనికి కొంత సమయం కావాలని మేము కోరుకున్నాము. అతను బ్యాట్‌తో ఏమి చేయగలడో చూశాము. బ్యాటింగ్ ఆర్డర్‌తో ఇది దీర్ఘకాలిక ప్రణాళిక కాదు. ఆ టెస్టు మ్యాచ్‌కి సరైన ప్రణాళికతో మేం వెళ్తాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు. మ‌న‌ బౌలర్లను చూస్తుంటే గర్వంగా ఉంది" అని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

Follow Us:
Download App:
  • android
  • ios