ఇంగ్లాండ్ జట్టుకి భారత పర్యటనలో ఊహించని ఓటమి నెలకొంది. కనీసం ఒక్క ఫార్మాట్ లో కూడా విజయం దక్కలేదు. అన్నీ ఫార్మాట్లు టీమిండియానే సొంతం చేసుకుంది. ఆదివారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన.. మూడో వన్డే సైతం ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో 2-1 తేడాతో సిరీస్ ని కైవసం చేకుంది.

కాగా..భారత్ విజయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ రవి శాస్త్రి కూడా జట్టుపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియాకి టేక్ ఏ బో అంటూనే శుభాకాంక్షలు తెలిపాడు.

జట్టు విజయం సాధించినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రపంచంలో కెల్లా అత్యంత బెస్ట్ జట్లు ఈ సిరీస్ ల కోసం తలపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. అత్యంత క్లిష్టసమయంలో.. అరుదైన విజయంతో.. లైఫ్ టైమ్ గుర్తిండిపోయేలా చేశారంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

 

పుణెలో 330 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సామ్‌ కరన్‌ (95) గెలిపించినంత పనిచేసినా.. భువీ (3), శార్దూల్‌ (4)ల ముందు ఆటలు సాగలేదు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 322 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్‌ మలన్‌ (50) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 

రెండో వన్డేలో 43 ఓవర్లకే 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసింది ఇంగ్లాండ్. దీంతో టీమ్‌ఇండియా.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయగలదా అనిపించింది. అందుకు తగ్గట్టుగానే మూడు బౌండరీలు బాదేసిన జేసన్‌ రాయ్‌ (14) భయపెట్టాడు. అయితే భువీ అతనిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీని నుంచి తేరుకునే లోపే జానీ బెయిర్‌ స్టో (1)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో బెన్‌స్టోక్స్‌ (35) నిలబడే ప్రయత్నం చేశాడు.  అతడిని నటరాజన్‌ పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే ప్రమాదకర జోస్‌ బట్లర్‌ (15)ను శార్దూల్‌ ఎల్బీ చేశాడు. లియామ్‌ లివింగ్‌స్టన్‌ (36;) మలన్‌నూ సైతం అతనే ఔట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.