అశ్విన్ సెంచరీ చేయగానే.. అతనికన్నా ముందు తోటి క్రికెటర్ సిరాజ్ మహ్మద్ ఆనందం వ్యక్తం చేశాడు. 

ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్టు సిరీస్ కోసం తలపడుతోంది. మొదటి మ్యాచ్ చేజార్చుకున్నా.. రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. మరీ ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ .. తన ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇటు బ్యాటింగ్.. అటు ఫీల్డింగ్ లోనూ అదరగొట్టి.. రికార్డుల వరద కురిపించాడు.

ఈ క్రమంలోనే అశ్విన్ 106 పరుగులు చేశాడు. కాగా... అశ్విన్ సెంచరీ చేయగానే.. అతనికన్నా ముందు తోటి క్రికెటర్ సిరాజ్ మహ్మద్ ఆనందం వ్యక్తం చేశాడు. సిరాజ్ ఎంతగా ఆనంద పడ్డాడో అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. వారి మధ్య ఉన్న బంధానికి ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు కూడా ఆనందం వ్యక్తం చేశారు. సిరాజ్ కి కొంచెం కూడా ఈర్ష్య లాంటివి లేవంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. కాగా.. తాజాగా.. ఇదే విషయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందించారు.

అశ్విన్ సెంచరీ చేయగానే.. సిరాజ్ ఆనందం వ్యక్తం చేయడంపై సచిన్ తన అభిప్రయాన్ని తెలియజేశారు. దీనిని టీమ్ స్పోర్ట్ అంటారంటూ సచిన్ సిరాజ్ ని మెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా... ఇంగ్లండ్‌తో ఇదే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన భారత జట్టు రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుకుంది. 317 పరుగుల భారీ తేడాతో మరో ఒకటిన్నర రోజుల ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది.