Asianet News TeluguAsianet News Telugu

పింక్ బాల్ టెస్ట్... ఇంగ్లాండ్ సెలక్షన్ టీం పై మైకేల్ వాగన్ సీరియస్

ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్.. జట్టు రొటేషన్ పాలసీని సమర్థించుకున్నారు.

India vs England: Michael Vaughan Questions Selection As England Collapse In Third Test
Author
Hyderabad, First Published Feb 25, 2021, 11:22 AM IST

ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఇప్పటికే భారత్ తో ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టు మ్యాచ్ లు ఆడగా... 1-1 తో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. తొలి రెండు జట్లు చెన్నై వేదికగా జరగగా.. మూడో జట్టు అహ్మదాబాద్ వేదికగా కొనసాగుతోంది.

చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించగా.. ఇంగ్లాండ్ ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్.. జట్టు రొటేషన్ పాలసీని సమర్థించుకున్నారు. ఓటమికి అది కారణం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ విషయంపై తాజాగా సీనియర్ క్రికెటర్ మైకేల్ వాగన్ స్పందించాడు.

జట్టు సెలక్షన్ టీంపైనే సీరియస్ అయ్యాడు. జోస్ బట్లర్ మొదటి టెస్ట్ ఆడాడు, తరువాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు, ఆల్ రౌండర్ మొయిన్ అలీ రెండవ గేమ్ ఆడిన తరువాత అదే చేశాడు. అంతకుముందు, జానీ బెయిర్‌స్టోకు మొదటి రెండు టెస్టులకు విశ్రాంతి ఇవ్వగా, ప్రీమియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ప్రారంభ గేమ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన తర్వాత కూడా రెండవ గేమ్‌కు దూరమయ్యాడు.

ఇలా కీలక ఆటగాళ్లంతా జట్టు నుంచి తప్పుకోవడం.. ఇలా మారడం పై మైకేల్ వాగన్ మండిపడ్డాడు. అత్యుత్తమ జట్టుతో ఆడేటప్పుడు ఇలా ఆటగాళ్లను మార్చడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో తొలి రోజు ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. భారత బౌలర్ల మాయాజాలానికి ఇంగ్లాండ్ విలవిలలాడిపోయింది. ఈ క్రమంలోనే మైకేల్ వాగ్ ఇలా స్పందించారు.  జట్టులో మార్పుల కారణంగానే ఓటమిపాలౌతున్నారని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios