ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టులు జరగగా.. నాలుగో టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా.. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టు మ్యాచుల్లో రెండు భారత్ కైవసం చేసుకుంది. చివరగా నాలుగో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉంది.

అయితే.. అహ్మదాబాద్ పిచ్ పై గతంలోనే విమర్శలు వచ్చాయి. పిచ్ అనుకూలంగా లేదని అందుకే.. ఇంగ్లాండ్ జట్టు సరిగా ఆడలేకపోయిందని గతంలోనే ఆ జట్టు సీనియర్ క్రికెట్ మైకేల్ వాగన్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ క్రికెటర్లు సైతం ఆ పిచ్ పై విమర్శించారు. అయితే.. నాలుగో టెస్టు మళ్లీ మొదలౌతోందనగా.. మరోసారి మైకేల్ సైటర్లు వేశాడు.

నాలుగో టెస్టు కోసం ప్రిపరేషన్స్ కొనసాగుతున్నాయంటూ.. ఓ మడ్ పిట్ లో మైకేల్ బ్యాటింగ్ చేస్తున్నట్లు ఫోటో దిగి పోస్టు చేశాడు. అహ్మదాబాద్ పిచ్ ని వెటకారం చేస్తూ.. ఆయన అలా పోస్టు చేయడం గమనార్హం.

 

కాగా.. ఆయన చేసిన పోస్టుపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టీమిండియాకు మద్దుతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అంటే.. నాలుగో టెస్టు కూడా ఇండియానే గెలుస్తుందని మీరు కన్ఫామ్ అయిపోయారా అంటూ రివర్స్ లో మైకేల్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.