IND vs ENG : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో తొలి రోజు కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు. కీలకమైన ఐదు వికెట్లు తీసుకుని టెస్టు క్రికెట్ లో మరో ఘనత సాధించాడు.
IND vs ENG - Kuldeep Yadav: ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఇద్దరూ మంచి శుభారంభం లభించింది. ప్రారంభ ఓవర్లను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇద్దరూ కలిసి బౌలింగ్ చేశారు. అయితే, వారిని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధీటుగా ఎదర్కొన్నారు. ఆ తర్వాత బాల్ తో రంగంలోకి దిగిన కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఆ తర్వాత అశ్విన్ ఇంగ్లాండ్ ను కోలుకోకుండా చేశాడు.
బెన్ డకెట్ వికెట్ తో వికెట్ల వేట కొనసాగించిన కుల్దీప్ యాదవ్ కీలకమైన 5 వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ ను కుప్పకూల్చాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ తీసుకున్న తర్వాత కుల్దీప్ యాదవ్ టెస్టు క్రికెట్‌లో 4వ సారి 5 వికెట్లు తీశాడు. అలాగే, అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా కుల్దీప్ యాదవ్ రికార్డు సృష్టించాడు. కేవలం 1871 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే బుమ్రా, అక్షర్ పటేల్ ను అధిగమించాడు.
IND VS ENG : 5 వికెట్లు తీసిన తర్వాత కుల్దీప్ యాదవ్ రియాక్షన్ ఎంటో తెలుసా?
దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ యాదవ్ రికార్డు సృష్టించాడు. అక్షర్ పటేల్ 2205, జస్ప్రీత్ బుమ్రా 2520 బంతుల్లో 50 వికెట్లు తీశారు. ఇదిలావుండగా, 100 టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ మిగిలిన 4 వికెట్లను తీసుకున్నాడు. 100వ టెస్టు మ్యాచ్ లో 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. చివరకు ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.
IND vs ENG : గిల్ మామ అదరగొట్టాడు.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. వీడియో
