Asianet News TeluguAsianet News Telugu

గిల్, రోహిత్ నాటౌట్: థర్డ్ అంపైర్ మీద అసహనం, అంపైర్లతో జో రూట్ వాగ్వాదం

శుబ్మన్ గిల్, రోహిత్ శర్మల విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాలపై ఇంగ్లండు ఓపెనర్ జాక్ కాల్రే అసహనం వ్యక్తం చేశారు. ఆ రెండు సందర్భాల్లో జో రూట్ ఆన్ ఫీల్డ్ అంపైర్లతో వాదానికి దిగారు.

India vs England: England captain Jeo Root questions umpire
Author
Ahmedabad, First Published Feb 25, 2021, 10:55 AM IST

అహ్మదాబాద్: ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. అహ్మాదాబాదులోని మొతెరా స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచులో బుధవారం ఆ సంఘటనలు చోటు చేసుకున్నారు. తొలుత స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో శుభ్మన్ గిల్ ఇచ్చిన క్యాచ్ ను స్టోక్స్ అందుకున్నాడు. అయితే అది కాస్తా నేలకు తాకింది. దాంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

మరోసారి 31వ ఓవరులో లీచ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ స్టంప్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ రెండు సందర్భాల్లోనూ ఇంగ్లాండు కెప్టెన్ ఆన్ ఫీల్డ్ అంపైర్లతో వాదానికి దిగాడు. రోహిత్ శర్మ విషయంలో థర్డ్ అంపైర్ రీప్లేన్ అన్ని కోణాల్లో చూడలేదని అలా చూసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని జో రూట్ అన్నాడు. ఆ విషయాలపై ఇంగ్లండు ఓపెనర్ జాక్ కాల్రే స్పందించాడు. 

ఆ నిర్ణయాలు తమకు అనుకూలంగా రావాల్సి ఉండిందని ఆయన అన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాలు భారత్ కు అనుకూలంగా వెళ్లడం అసహనం కలిగిస్తోందని అన్నాడు. తాము ఆటలో వెనకబడ్డాంమని, ఇలాంటి నిర్ణయాలు విసుగు తెప్పిస్తున్నాయని ఆయన అన్నాడు. పరిస్థితులు చూస్తుంటే ఒక్కడు తమకు లాభించలేదని అన్నాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుందని అన్నాడు. 

అలాంటివి తమకు అనుకూలించకపోతే మ్యాచ్ గెలవలేమని జాక్ కాల్రే అన్నాడు. కానీ నిర్ణయాలు తమ చేతుల్లో లేవని, రానున్న రోజుల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తామి అన్నాడు. ఈ మ్యాచ్ గెలవడానికి అవకాశాలున్నాయని, అది జరగాలంటే అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదని అన్నాడు. రెండో రోజు కాస్తా మెరుగ్గా బౌలింగ్ చేసి టీమిండియా ఆధిక్యతను తగ్గిస్తామని చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios