ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అహ్మాదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ దాదాపు 60 వేల మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలో మొదటి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసుకున్న విషయం తెలిసిందే.

మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు నాలుగు మార్పులతో బరిలో దిగుతోంది. జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, క్రావ్లే జట్టులో రాగా డానియల్ లారెన్స్ స్టోన్, మొయిన్ ఆలీ జట్టులో చోటు కోల్పోయారు.  

భారత జట్టులో రెండు మార్పులతో బరిలో దిగనుంది. సిరాజ్ స్థానంలో బుమ్రా జట్టులో స్థానం దక్కించుకోగా కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కి చోటు దక్కింది. అయితే ఫిట్‌నెస్ సాధించినప్పటికీ ఉమేశ్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు. 

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్, సిబ్లీ, జాక్ క్రావ్లే, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఓల్లీ పోప్, బెన్ ఫోక్స్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు: విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ