Asianet News TeluguAsianet News Telugu

శార్దూల్ స్లో ఫీల్డింగ్.. మండిపడ్డ విరాట్ కోహ్లీ

 తర్వాత లక్ష్య  చేధనలో భాగంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కి దిగింది. స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో.. ఫీల్డింగ్ తో జట్టును కంట్రోల్ చేయాల్సి ఉంది

India vs England 3rd T20I: Virat Kohli Loses His Cool After Shardul Thakur's Lazy Fielding Effort. Watch
Author
Hyderabad, First Published Mar 17, 2021, 1:48 PM IST

టీమిండియా ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కోసం పోరాడి ఓడింది. 2-1 తేడాతో టీమిండియా ఓటమి పాలయ్యింది. అయితే.. ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ స్లో ఫీల్డింగ్ పై విరాట్ కోహ్లీ చాలా సీరియస్ అయ్యాడు. 

మూడవ టి 20 ఇంటర్నేషనల్ సందర్భంగా ఇంగ్లాండ్ అదనపు పరుగులు చేయటానికి అనుమతించింది. అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగగా.. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. 156 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.

దీంతో.. తర్వాత లక్ష్య  చేధనలో భాగంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కి దిగింది. స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో.. ఫీల్డింగ్ తో జట్టును కంట్రోల్ చేయాల్సి ఉంది. అయితే.. ఫీల్డింగ్ విషయంలో టీమిండియా గట్టిగా నిలపడలేకసోయింది. ఇంగ్లాండ్ జట్టును తమ ఫీల్డింగ్ తో కట్టడి  చేయలేకపోయింది.

 

12 వ ఓవర్లో, జానీ బెయిర్‌స్టో బంతిని లెగ్ సైడ్‌కు తన్నాడు ఆ సమయంలో  శార్దూల్ ఠాకూర్ నెమ్మదిగా స్పందించాడు.అతను బంతికి చేరుకున్నప్పుడు, అతను స్టంప్స్‌లో కాకుండా కవర్ వైపు వెళ్ళిన వైల్డ్ త్రో చేశాడు. శార్దూల్  స్లోగా స్పందించడం వల్ల వికెట్ తీసే అవకాశం కోల్పోయారు. దీంతో.. విరాట్ కోహ్లీ.. తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. 

కాగా.. తొలి టీ20 మ్యాచ్ లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ.. మిగిలిన రెండు టీ20ల్లో మాత్రం చెలరేగిపోయాడు. 46 బంతులకు 77 పరుగులు చేశాడు. అయితే.. కోహ్లీ ఎంత కష్టపడినా.. జట్టు మాత్రం విజయం సాధించలేదు. ఈ క్రమంలో సిరీస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios