Asianet News TeluguAsianet News Telugu

హర్భజన్ కి అశ్విన్ క్షమాపణలు.. కారణం ఇదే..!

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

India vs England, 2nd Test: "Sorry Bhajju Pa", Says Ravichandran Ashwin After Breaking Harbhajan Singh's Record
Author
Hyderabad, First Published Feb 15, 2021, 8:19 AM IST

చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ ధాటికి ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అశ్విన్ రికార్డుల వరద పారించాడు. స్వదేశంలో అత్యధిక సార్లు ఐదు వికెట్లు సాధించిన బౌలర్ గా అశ్విన్ రికార్డు సాధించాడు. భారత్ లో 45 టెస్టులు ఆడిన అతను ఒకే ఇన్నింగ్స్ లో 23సార్లు ఐదు వికెట్లు సాధించాడు. 

కాగా... ఇండియన్ సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ రికార్డును కూడా అశ్విన్ బ్రేక్ చేశాడు.  ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.  ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ను అశ్విన్‌ అధిగమించాడు. రెండో టెస్టు రెండో రోజు ఆటలో బెన్‌స్టోక్స్‌ను ఔట్‌ చేయడం అశ్విన్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. హర్భజన్ రికార్డు అధిగమించిన తర్వాత అశ్విన్ దీనిపై స్పందించాడు. వెంటనే భజ్జీకి క్షమాపణలు తెలియజేశాడు. ‘సారీ భజ్జూ పా’ అంటూ పేర్కొనడం గమనార్హం. 


సొంతగడ్డపై అశ్విన్‌ 28.76 సగటుతో 265 వికెట్లు పడగొట్టాడు.ఓవరాల్‌గా అశ్విన్‌ ఇప్పటి వరకు 76 టెస్టుల్లో 391 వికెట్లు తీశాడు. స్పిన్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే భారత్‌లో 24.88 సగటుతో 350 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో కుంబ్లే మొత్తం 619 వికెట్లు తీసి భారత లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.  ఈ లిస్టులో హర్భజన్‌ 417 వికెట్లతో  మూడో స్థానంలో ఉండగా.. అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. లెజండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ 434 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios