కరోనా మహమ్మారి ఎంటరైన తర్వాత క్రికెట్ లో రూల్స్ కూడా మారిపోయాయి. బాల్ కి ఉమ్ము రాయకూడదనే నిబంధన కూడా కరోనా తర్వాతే వచ్చింది. అయితే... ఆ నిబంధనలకు విరుద్ధంగా బంతిపై ఉమ్ము రాసినందుకు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు.

శుక్రవారం రెండో వన్డేలో నాలుగో ఓవర్లలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐసీసీ నిబంధనను మరిచిపోయిన స్టోక్స్ బంతికి ఉమ్ము రాయడంతో అంపైర్లు నితిన్ మేనన్, వీరేంద్ర శర్మలు స్టోక్స్ తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ను మందలించారు.

కాగా.. స్టోక్స్ ఇలా చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల అహ్మదాబాద్ లో పింక్ బాల్ టెస్టులోనూ నిబంధన ఉల్లంఘించిన అతడిని అంఫైర్లు హెచ్చరించారు. కోవిడ్ -19 కారణంగా బంతిపై ఉమ్ము రాయడాన్ని ఐసీసీ నిషేధించింది.