Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాతో తొలి టెస్టు: ఓపెనర్లు ఇద్దరూ అవుట్! కోహ్లీ అట్టర్ ఫ్లాప్... 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు... 1 పరుగుకే అవుటైన విరాట్ కోహ్లీ... 

India vs Bangladesh: KL Rahul, Shubman Gill, Virat Kohli goes without good start, Team India lost
Author
First Published Dec 14, 2022, 10:41 AM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాపార్డర్ ఫెయిల్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయింది. శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఆడుతూ తొలి వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో యాసిర్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. 54 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్. 48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. సీనియర్ వన్‌డౌన్ ప్లేయర్ ఛతేశ్వర్  పూజారాతో పాటు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్రీజులో ఉన్నాడు. 

వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ టాస్ ఓడిపోయిన టీమిండియా, తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  తొలి టెస్టులో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకొచ్చి, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే చోటు కల్పించడం విశేషం. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రాగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు...

వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. మహ్మద్ షమీ గాయపడడంతో 12 ఏళ్ల తర్వాత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్న జయ్‌దేవ్ ఉనద్కట్... ఊహించినట్టుగానే రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్‌లో పిచ్‌, వాతావరణ పరిస్థితులు కూడా ఇండియాలోలాగే స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. ఇదే ఉద్దేశంలో ముగ్గురు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకొచ్చింది భారత జట్టు..

శార్దూల్‌ ఠాకూర్‌కి తుది జట్టులో అవకాశం రావచ్చని అందరూ భావించినా కుల్దీప్ యాదవ్ రూపంలో ఓ అదనపు స్పిన్నర్ తుది జట్టులోకి రావడంతో అతనికి నిరాశే ఎదురైంది. గాయం కారణంగా తొలి టెస్టుకి ముందు ఆసుపత్రిలో చేరిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కోలుకుని నేటి టెస్టులో బరిలో దిగుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్ మాత్రం నేటి మ్యాచ్‌కి దూరమయ్యాడు. నేటి మ్యాచ్ ద్వారా జాకీర్ హసన్ టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. భారత్ ఏ జట్టుతో జరిగిన మ్యాచుల్లో రెండు సెంచరీలతో అదరగొట్టిన జాకీర్ హసన్... తొలి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలని ఆశపడుతున్న టీమిండియా... బంగ్లాతో రెండు టెస్టులను గెలవడం చాలా అవసరం. బంగ్లాదేశ్ ఒక్క టెస్టును డ్రా చేసుకోగలిగినా టీమిండియా ఫైనల్ ఆశలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios