Asianet News TeluguAsianet News Telugu

ఇరగదీసిన ఇషాన్ కిషన్... డబుల్ సెంచరీతో రికార్డుల ఊచకోత...

126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్... కోహ్లీతో కలిసి రికార్డు భాగస్వామ్యం నమోదు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు బ్రేక్... 

India vs Bangladesh: Ishan Kishan breaks records with Double century
Author
First Published Dec 10, 2022, 2:16 PM IST

ఎన్నో మ్యాచులుగా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారనే కసి... రాక రాక వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలనే పట్టుదల... ఇవన్నీ కలిపి కొట్టినట్టుగా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్... బంగ్లాతో మూడో వన్డేలో డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. 85 బంతుల్లో వన్డేల్లో తొలి సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, శతకం తర్వాత మరింత వేగంగా దూకుడు పెంచి బంతుల్లో డబుల్ సెంచరీని అందుకున్నాడు...

వన్డేల్లో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషనే. బంగ్లాదేశ్‌లో ఇషాన్ కిషన్‌దే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు ఇషాన్ కిషన్...

ఈ మ్యాచ్‌లో సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, బంగ్లాపై అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 2000వ సంవత్సరంలో 7 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్...

ఇంతకుముందు కపిల్ దేవ్ తొలి సెంచరీ చేసిన మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 103 బంతుల్లో 150 దాటిన ఇషాన్ కిషన్, అత్యంత వేగంగా 150+ బాదిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ 112 బంతుల్లో 150+ స్కోరు నమోదు చేశాడు.  

2020 జనవరిలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ బాదాడు రోహిత్ శర్మ. రెండున్నరేళ్ల తర్వాత టీమిండియా తరుపున వన్డేల్లో శతకం బాదిన ఓపెనర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. 

తొలి రెండు వన్డేల్లో సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయిన శిఖర్ ధావన్, మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన శిఖర్ ధావన్... మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

ఈ వన్డే సిరీస్‌లో 6 సగటుతో పరుగులు చేసిన శిఖర్ ధావన్, చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. శిఖర్ ధావన్ అవుటైన తర్వాత  విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ తన స్టైల్‌లో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తే... విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఎక్కువగా సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...

1 పరుగు వద్ద విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ జారవిడిచాడు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. బంగ్లాదేశ్‌లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా గంభీర్ తర్వాతి స్థానంలో నిలిచాడు ఇషాన్ కిషన్...

గౌతమ్ గంభీర్ 21 ఏళ్ల 184 వయసులో బంగ్లాలో 50+  స్కోరు చేసిన భారత ఓపెనర్‌గా ఉండగా ఇషాన్ కిషన్ వయసు 24 ఏళ్ల 145 రోజులు. బంగ్లాదేశ్‌లో 1000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. బంగ్లాలో 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు విరాట్. రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌లో 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా విరాట్ ఆ రికార్డును సమం చేశాడు..

సచిన్ టెండూల్కర్ 6 దేశాల్లో 1000+ వన్డే పరుగులను అందుకోగా విరాట్ కోహ్లీ నాలుగు దేశాలపై ఈ ఫీట్ సాధించాడు. సనత్ జయసూర్య, జయవర్థనే ఐదు దేశాలపై ఈ ఫీట్ సాధించి.. విరాట్ కంటే ముందున్నారు. బంగ్లాదేశ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. బంగ్లాపై సచిన్ 1316 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 1320+ పరుగులను దాటేశాడు...

85 బంతుల్లో సెంచరీని అందుకున్న ఇషాన్ కిషన్, ఆ తర్వాత మరింత వేగం పెంచాడు.  126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదాడు ఇషాన్ కిషన్... వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఇషాన్ కిషన్.. 138 బంతుల్లో ద్విశతకం బాదిన క్రిస్ గేల్ రికార్డును కూడా తిరగరాశాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios