Asianet News TeluguAsianet News Telugu

రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన బంగ్లాదేశ్... రోహిత్ సేనకు పరువు సమస్యగా మారిన...

రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో టీమిండియా... 

India vs Bangladesh: Bangladesh won the toss and elected to bat first
Author
First Published Dec 7, 2022, 11:11 AM IST

బంగ్లాదేశ్‌ పర్యటనలో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. రెండో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని, ఛేదనలో విజయాన్ని అందుకున్న బంగ్లా... రెండో వన్డేలో బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం...

తొలి వన్డేలో ఆఖరి వికెట్ తీయలేక ఓడిన భారత జట్టు, సిరీస్ నిలవాలంటే నేటి మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. తొలి వన్డేలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. నేటి మ్యాచ్‌లో సీనియర్లు బ్యాటింగ్‌లో రాణించడంపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది...

కెప్టెన్సీ చేపట్టిన తర్వాత పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో అయినా తిరిగి ఫామ్‌లోకి వస్తాడా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రోహిత్ మునుపటి ఫామ్‌ని అందుకుంటే బంగ్లాదేశ్‌పై గెలవడం అంత కష్టమేమీ కాదు...

తొలి వన్డేలో స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో భారత బౌలర్లు అద్భుతంగా పోరాడారు. అయితే ఆఖరి వికెట్ తీయడంలో జరిగిన జాప్యానికి, భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.  రెండో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. ఆల్‌రౌండర్ షాబజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు...

అలాగే తొలి వన్డేలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యంగ్ పేసర్ కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చాడు. కుల్దీప్ సేన్ అనారోగ్యానికి గురి కావడంతో అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని ఆడిస్తున్నట్టు తెలియచేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..  

దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నడిపించబోతుంటే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. 

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ షాంటో, లిటన్ దాస్, అన్మోల్ హక్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం, మహ్మదుల్లా, అఫిఫ్ హుస్సేన్, మెహిడీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబడట్ హుస్సేన్, ముస్తఫిజుర్ రహ్మాన్

Follow Us:
Download App:
  • android
  • ios