Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘన విజయం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా భారీ విజయాన్నిఅందుకుంది. కెరీర్లో 100 వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ ఆకాశమే  హద్దుగా చెలరేగి విజయాన్ని అందించాడు. 

India vs Bangladesh, 2nd T20I - Live Cricket Score, Commentary
Author
Rajkot, First Published Nov 7, 2019, 7:42 PM IST

రాజ్ కోట్ వేదికన జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తన కెరీర్లో సెంచరీ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడు 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయినా జట్టుకు మాత్రం మరుపురాని విజయాన్ని అందించాడు. 

అతడు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ 31, శ్రేయాస్ అయ్యార్ 24, కేఎల్ రాహుల్ 6 పరుగులు చేశారు. దీంతో భారత్ అతి సునాయాసంగా 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జోరుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించేలా కనిపించిన అతడు  85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 

భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమినుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డవ్వడంతో 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. టీమిండియా విజయానికి ఇంకా 36 పరుగులు అవసరం. 

కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా 9.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. మొసద్దిక్ హుస్సేన్ బౌలింగ్‌లో హిట్ మ్యాన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే రోహిత్ అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

టీమిండియా ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 5.2 ఓవర్లలోనే భారత్ 50 పరుగుల మార్క్‌ను దాటింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 46, శిఖర్ ధావన్ 13 పరుగులతో ఉన్నారు. 

బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా టీమిండియా 22 పరుగులు చేసింది. 

రాజ్‌కోట్ టీ20లో బంగ్లాదేశ్ భారత్ ముందు 154 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు లిటన్ దాస్ 29, మహ్మద్ నయిమ్ 36 పరుగులతో విజృంభించగా చివర్లో మహ్మదుల్లా 30, సౌమ్య సర్కార్ 30 ధాటిగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ 2, చాహర్, ఖలీల్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. 

ధాటిగా ఆడుతున్న మహ్మదుల్లా ఔటయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అతను 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

స్పీడ్ పెంచే క్రమంలో బంగ్లా క్రికెటర్లు తడబడుతున్నారు. ఈ క్రమంలో ఆసిఫ్ హుస్సేన్ ఔటయ్యాడు. ఖలీల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి హుస్సేన్ ఔటయ్యాడు. మరోవైపు మహ్మదుల్లా మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 

బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న సౌమ్యా సర్కార్ 30 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. చాహల్ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ముందుకు రావడంతో వికెట్ కీపర్ రిషభ్ పంత్ అతనిని స్టంపౌట్ చేశాడు. 

కొద్ది పరుగుల తేడాతోనే బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. వికెట్ కీపర్, తొలి టీ20లో జట్టును గెలిపించిన ముష్పీకర్ రహీమ్ 4 పరుగులకే వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్‌లో కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చిన రహీమ్ ఔట్ అయ్యాడు. 

బంగ్లాదేశ్ కీలక వికెట్ కోల్పోయింది అర్ధసెంచరీకి చేరువవుతున్న మహ్మద్ నయిమ్ పెవిలియన్ చేరాడు. సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అతను శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముష్ఫీకర్ రహీమ్, సౌమ్య సర్కార్ క్రీజులో ఉన్నారు. 

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు భారత బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. లిట్టన్ దాస్ ఔటైనా నయిమ్, సౌమ్య సర్కార్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 1 వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో 100వ టీ20. 

ప్రమాదకర లిట్టన్ దాస్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. చాహల్ వేసిన 7.2వ బంతి నేరుగా లిట్టన్ దాస్ ప్యాడ్లను తాకింది. పంత్ చేసిన అప్పీల్‌లకు అంపైర్ ఎల్వీ ఇవ్వకపోవడంతో దాస్ పరుగుకు ప్రయత్నించాడు. బంతిని రెప్పపాటులో అందుకున్న పంత్ వికెట్ల మీదకు విసిరేశాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (సి), శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌పంత్‌, శివమ్‌ దూబె, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, యుజువేంద్ర చాహల్‌, ఖలీల్‌ అహ్మద్‌  

బంగ్లాదేశ్ జట్టు: మహ్మదుల్లా (సి), లిటన్‌ దాస్‌, మహ్మద్‌ నయీమ్‌, సౌమ్య సర్కార్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, అఫిఫ్‌ హుస్సేన్‌, మొసాదిక్ హుస్సేన్‌, అమినుల్‌ ఇస్లామ్‌, షఫియుల్‌ ఇస్లామ్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, అల్‌ అమిన్‌ హుస్సేన్‌  

Follow Us:
Download App:
  • android
  • ios