Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ బాటలోనే ఉమేశ్ యాదవ్... సక్సెస్ కోసం ఉజ్జయిని మాహాకాళేశ్వరుడిని..

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ సక్సెస్ తర్వాత ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమేశ్ యాదవ్...

 

India vs Australia: Umesh Yadav in Mahakaleshwar Temple in Ujjain cra
Author
First Published Mar 21, 2023, 9:36 AM IST

టీమిండియా క్రికెటర్లు మహా శివుడి కటాక్షం కోసం పరితపిస్తున్నారు. మూడున్నరేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుష్క శర్మతో కలిసి నిష్టగా శివార్చన చేశాడు. ఆ తర్వాత అహ్మదాబాద్ టెస్టులో 186 పరుగులు చేసి, టెస్టుల్లో 28వ సెంచరీని అందుకున్నాడు...

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, ఆఖరి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి మూడు ఫార్మాట్లలో 10కి పైగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు’ దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర లిఖించాడు...


ఆ తర్వాత భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ కూడా విరాట్ కోహ్లీ బాటలోనే నడిచాడు. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్న కెఎల్ రాహుల్, భార్య అథియా శెట్టితో కలిసి  ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి అభిషేకం చేయించారు. టీమిండియా ‘రాహువులా పట్టాడని’ విమర్శలు ఎదుర్కొంటున్న కెఎల్ రాహుల్‌ని కూడా శివుడు కరుణించాడు...

టెస్టుల్లో, టీ20ల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న కెఎల్ రాహుల్, ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసి విమర్శలకు సమాధానం చెప్పేశాడు. తాజాగా భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్ కూడా ఉజ్జయిని ఆలయంలో మహాకాళేశ్వరుడికి అర్చన చేయించాడు...


ఉమేశ్ యాదవ్ వ్యక్తిగత జీవితంలో గత నెలన్నర రోజుల్లో దు:ఖాన్ని, ఆనందాన్ని కలిపి చూడాల్సి వచ్చింది. ఫిబ్రవరి 23న ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణించిన తర్వాత ఇండోర్ టెస్టులో 3 వికెట్లు తీసి మంచి బౌలింగ్ పర్ఫామెన్స్ కనబరిచాడు ఉమేశ్ యాదవ్...

ఇండియాలో 100 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఉమేశ్ యాదవ్, నాలుగో టెస్టుకి ముందు రోజు తండ్రి అయ్యాడు. మార్చి 8న ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది ఉమేశ్ యాదవ్ సతీమణి తాన్యా... టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్‌లో ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కలేదు..

దీంతో ఐపీఎల్ 2023 టోర్నీకి ముందు బ్రేక్ దొరకడంతో ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకుని మహాకాళేశ్వరుడికి మొక్కు చెల్లించుకున్నాడు ఉమేశ్ యాదవ్. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ప్రధాన బౌలర్‌గా మారిన ఉమేశ్ యాదవ్, ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టి వైట్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాని ఆశపడుతున్నాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios