Asianet News TeluguAsianet News Telugu

IND Vs AUS T20 Series: నవంబర్ 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, జ‌ట్ల వివ‌రాలు..

IND Vs AUS T20 Series: ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
 

India Vs Australia T20 Series from November 23,  full schedule and teams RMA
Author
First Published Nov 21, 2023, 5:06 AM IST | Last Updated Nov 21, 2023, 5:06 AM IST

India Vs Australia T20 Series: ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2023లో భాగంగా  ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో కంగారూల చేతిలో 6 వికెట్ల తేడాతో భార‌త్ నిరాశపరిచింది. దీని తర్వాత భారత్ తదుపరి సవాల్‌కు సిద్ధమైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ, రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.

నవంబర్ 23 నుంచి విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ఉండగా, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా నాలుగో, ఐదో టీ20లకు జట్టులో చేరనున్నాడు. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా సైతం జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా మాథ్యూ వేడ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కాగా, నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ వైజాగ్, త్రివేండ్రం, గౌహతి, నాగ్‌పూర్, హైదరాబాద్‌లోని ఐదు వేదికలపై జరగనుంది. విశాఖపట్నంలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం (నవంబర్ 23) ప్రారంభమవుతుంది.

 India Vs Australia T20 Seriesషెడ్యూల్ :

మొద‌టి మ్యాచ్- నవంబర్ 23 (గురువారం), రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
2వ మ్యాచ్- నవంబర్ 26 (ఆదివారం), గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
3వ మ్యాచ్- 28 నవంబర్ (మంగళవారం), బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
4వ మ్యాచ్ 01 డిసెంబర్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్‌పూర్
5వ మ్యాచ్- 03 డిసెంబర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

భారత జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ , ఫేమస్ కృష్ణ, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.

ఆస్ట్రేలియా జ‌ట్టు :

మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లీష్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios