Asianet News TeluguAsianet News Telugu

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్ ఇదే... 24న హైదరాబాద్‌కి భారత జట్టు...

India vs Australia T20 Series: సెప్టెంబర్ 18 నుంచి మొహాలీలో ప్రాక్టీస్ సెషన్స్... సెప్టెంబర్ 20న మొహాలీలో మొదటి టీ20 మ్యాచ్...

 

India vs Australia T20 Series Complete Schedule, Indian Cricket team travel to Hyderabad
Author
First Published Sep 15, 2022, 5:10 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భారత జట్టు ప్లేయర్లు మొహాలీలో భారత క్యాంపులో కలిశారు. యూఏఈలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కో త్వరలో స్వదేశానికి చేరుకుని జట్టుతో కలుస్తారు...

గాయం నుంచి కోలుకున్న జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ ప్రస్తుతం ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నారు. వీరంతా మొహాలీ చేరుకుని సెప్టెంబర్ 18 నుంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకూ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది భారత జట్టు. ఆ తర్వాత సాయంత్రం మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొంటాడు...

సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకూ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారు భారత క్రికెటర్లు. ఆ రోజు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మీడియాతో సమావేశమవుతాడు. సెప్టెంబర్ 20న మొహాలీలో మొదటి టీ20 ఆడే భారత జట్టు, 21న నాగ్‌పూర్‌కి బయలుదేరి వెళ్తుంది.

నాగ్‌పూర్‌లో సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకూ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది భారత జట్టు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లో రెండో టీ20 ఆడే టీమిండియా, 24న హైదరాబాద్‌కి బయలుదేరి వెళ్తుంది...

ఆదివారం సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఖరి టీ20 మ్యాచ్ జరుగుతుంది.  టీ20 మ్యాచులన్నీ సాయంత్రం 7:30 గంటకు ప్రారంభం అవుతాయి. 

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కి టీమిండియాతో జరిగే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అతని స్థానంలో కామెరూన్ గ్రీన్, టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌లో ఆడతాడు. 

టీమిండియాతో టీ20 సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇది: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, జోష్ హజల్‌వుడ్, జోష్ ఇంగ్లీష్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, ఆడమ్ జంపా

Follow Us:
Download App:
  • android
  • ios