Asianet News TeluguAsianet News Telugu

ఈ సిరీస్ విజయం పూర్తిగా నీదే! ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడని రోహిత్ శర్మ...

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మొదటి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా... రోహిత్ కెప్టెన్సీలో ఆడిన ఆఖరి వన్డేలో ఓటమి..

India vs Australia: Rohit Sharma refused to take trophy, give it to KL Rahul CRA
Author
First Published Sep 28, 2023, 9:39 AM IST | Last Updated Sep 28, 2023, 9:39 AM IST

టీమిండియా కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ, గత రెండేళ్లలో ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. రెండేళ్లలో ఏకంగా 8 మంది కెప్టెన్లను మార్చింది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది భారత జట్టు..

మొదటి రెండు వన్డేలకు కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. హార్ధిక్ పాండ్యాకి కూడా రెస్ట్ ఇవ్వడంతో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయాలు అందుకున్న భారత జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియాపై మొదటి రెండు మ్యాచులు గెలిచిన భారత జట్టు, వీరిద్దరూ ఆడిన మూడో వన్డేలో మాత్రం 66 పరుగుల తేడాతో ఓడింది. ఈ కారణంగానేమో వన్డే సిరీస్ ట్రోఫీ బహుకరణ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, దూరంగా ఉన్నాడు..

ట్రోఫీ అందించిన నిరంజన్ షా, రోహిత్‌ను రమ్మని పిలిచాడు. రోహిత్ వెళ్లినా, ట్రోఫీపై చేతులు వేసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలేదు. మొదటి రెండు వన్డేలు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే గెలిచింది టీమిండియా. కాబట్టి అతనే కెప్టెన్‌గా ట్రోఫీ అందుకోవడానికి అర్హుడు అన్నట్టుగా చెప్పాడు రోహిత్ శర్మ...

ఆఖరి వన్డేలో టీమిండియా గెలిచి ఉంటే, ట్రోఫీ అందుకోవడానికి, కనీసం ట్రోఫీ మీద చేతులు వేసి ఫోటోలు దిగడానికి అర్హుడిగా అయ్యేవాడని అన్నట్టుగా రోహిత్ శర్మ ప్రవర్తించడం, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ప్రవర్తనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. 

రాజ్‌కోట్‌లో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ 96 పరుగులు, స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేశారు..

భారత జట్టు 49.4 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ 81 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 56, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios