ముంబై వన్డే: పరమ చెత్తగా కోహ్లీ సేన ఓటమి, ఓపెనర్లే ఫినిష్ చేశారు
ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తుగా ఓడించింది. వికెట్ కోల్పోకుండా టీమిండియా తమ మిుందు ఉంచిన 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన తొలిా వన్డే మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై పరమ చెత్గగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా భారత్ పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ 128 పరుగులు చేయగా, ఆరో ఫించ్ 110 పరుగులు చేశాడు. వారిద్దరు మ్యాచ్ ను 37. 4 ఓవర్లలోనే ఫినిష్ చేశారు.
భారత్ తమ ముందు ఉంచిన 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ దూకుడు ప్రదర్శించారు. వారిద్దరు అర్థ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్లకు చెమటలు పట్టించారు..వారిద్దరు సెంచరీలతో భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. .
ఆస్ట్రేలియా పేస్ ముందు టీమిండియా నిలబడలేకపోయింది. టాప్ ఆర్డర్ ఇచ్చిన ఆరంభాన్ని మిడిలార్డర్ ఉపయోగించుకోలేక చేతులేత్తేయడంతో భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటై.. ఆసీస్ ముందు 256 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
శిఖర్ ధావన్ 74, లోకేశ్ రాహుల్ 47 పరుగులతో చక్కని పునాది వేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. రిషభ్ పంత్ 28, రవీంద్ర జడేజా కాసేపు పోరాడినప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. చివర్లో మహ్మద్ షమీ, కుల్‌దీప్ జాదవ్ పోరాడటంతో భారత్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కమ్మిన్స్, రిచర్డ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఒత్తిడికి గురైన టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. స్టీవెన్ స్మిత్ మెరుపు ఫీల్డింగ్‌కు 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్ రన్ ఔట్ అయ్యాడు. అంతకు ముందు భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. చివర్లో మెరుపులు మెరిపించే శార్థూల్ ఠాకూర్‌ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండు ఫోర్లతో ధాటిగా ఆడిన శార్ధూల్... స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడ్డాడు.
28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో టర్నర్‌కు క్యాచ్ ఇచ్చి రిషభ్ పంత్ ఔటయ్యాడు. దాంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.దూకుడుగా ఆడుతున్న రవీంద్ర జడేజా 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు.. వరుస ఓవర్లలో భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడమ్ జంపాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.
భారత్ కొద్దిపరుగుల వ్యవధిలో మూడో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో అగర్‌కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఓపెనర్ లోకేశ్ రాహుల్ హాఫ్ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. ధావన్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిర్మించిన రాహుల్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అగర్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నిలకడగా ఆడిన గబ్బర్ సింగ్ 66 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది అతనికి వన్డేల్లో 28వ అర్ధసెంచరీ.
టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడుతున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియాకు స్మిత్, వార్నర్‌ల పునరాగమనంతో మరింత బలం పుంజుకుంది. శివమ్ ధూబే, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, చాహల్, నవదీప్ షైనీలకు భారత్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు.
భారత జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ఆస్టన్ టర్నర్, అలెక్స్ కేరీ, ఆస్టన్ ఏగర్, కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా