Asianet News TeluguAsianet News Telugu

భారత్-సౌతాఫ్రికా టీ20... కొత్త జెర్సీలో మెరవనున్న టీమిండియా ప్లేయర్స్

ధర్మశాల వేదికన ఇవాళ జరగనున్న టీ20 మ్యాచ్ లో టీమిండియా కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. నూతన జెర్సీని శనివారం కెప్టెన్ రవిశాస్త్రి, సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, చీఫ్ కోచచ్ రవిశాస్త్రిలు ఆవిష్కరించారు.   

India jersey with new sponsor  Byju's logo
Author
Dharamshala, First Published Sep 15, 2019, 12:47 PM IST

ప్రపంచ కప్, వెస్టిండిస్ పర్యటనలో అదరగొట్టిన టీమిండియా మరో రసవరత్త పోరుకు సిద్దమైంది. గతకొంత కాలంగా విదేశీ పర్యటనల్లో సత్తాచాటుతూ వస్తున్న కోహ్లీసేన సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తలపడనుంది. ధర్మశాల వేదికన ఇవాళ(ఆదివారం)  ఇరుజట్ల  మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీతో మెరవనున్నారు. 

శనివారం ధర్మశాలలో నూతన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో పాటు చీఫ్ కోచ్ రవిశాస్త్రి కొత్త జెర్సీలో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు ధరించే జెర్సీపై చైనా  మొబైల్ కంపనీ ఒప్పో పేరు వుండేది. దాని స్థానంలో భారత్ కు చెందిన ఆన్‌‌లైన్ ట్యుటోరియర్ సైట్ బైజూస్ చేరింది. 

బిసిసిఐ తో  ఒప్పో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ళపాటు ఒప్పో టీమిండియా స్పాన్సర్ గా కొనసాగాల్సి వుంది. 2017 లో రూ. 1079 కోట్లతో ఒప్పో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ కేవలం రెండేళ్లలోనే ఆ సంస్థ మనసు మార్చుకుంది. ఇంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించలేమని పేర్కొంటూ స్పాన్సర్‌షిప్ ను రద్దు చేసుకోడానికి ప్రయత్నించింది. 

అయితే మిగతా మూడేళ్ల కాలానికి టీమిండియాకు స్పాన్సర్ చేయడానికి బైజూస్ ముందుకు వచ్చింది. దీంతో ఒప్పో, బైజూస్ లు పరస్పరం ఓ అంగీకారాన్ని కుదుర్చుకుని స్పాన్సర్‌షిప్ హక్కులను బదిలీ చేసింది. ఇలా అన్యూహ్యంగా టీమిండియా  జెర్సీపై ఒప్పో పేరు మాయమై బైజూస్ పేరు చేరింది. 2022 వరకు బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎడ్యుకేషన్ యాప్  బైజూస్ టీమిండియా స్పాన్సర్ గా వ్యవహరించనుంది. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios