జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 టోర్నీ కోసం 15 మందితో కూడిన ఇండియా  - ఏ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోవడం విశేషం. 

జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలో జరిగే ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన ఇండియా - ఏ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు యశ్ ధుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నెరవేరుస్తాడు. ఇక ఈ జట్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోవడం విశేషం. ఇండియా - ఏ జట్టుకు సితాంషు కొటక్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. 

భారత- ఏ జట్టు ఇదే :

యశ్‌ ధుల్‌(కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్‌, నికిన్‌ జోస్‌, ప్రదోష్‌ రంజన్‌ పాల్‌, రియాన్‌ పరాగ్‌, నిశాంత్‌ సంధు, మానవ్‌ సుతార్‌, యువరాజ్‌సిన్హ్‌ దోడియా, హర్షిత్‌ రానా, ఆకాశ్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్‌ హంగ్రేకర్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు : స్నెల్‌ పటేల్‌, మోహిత్‌ రేద్కార్‌, హర్ష్‌ దూబే, నేహాల్‌ వధేరా

కోచ్‌లు : సితాంశు కొటక్‌(హెడ్‌కోచ్‌), సాయిరాజ్‌ బహూతులే (బౌలింగ్‌ కోచ్‌), మునిష్‌ బాలి(ఫీల్డింగ్‌ కోచ్‌)

ఇక ఈ టోర్నీలో గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు.. నేపాల్‌, యూఏఈ, పాకిస్తాన్‌- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఒమన్‌- ఏ జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్‌ జరుగనుంది. 

టోర్నీలో భారత్ షెడ్యూల్ ఇదే :

13.07.23 : ఇండియా ఏ vs యూఏఈ ఏ
15.07.23 : ఇండియా ఏ vs పాకిస్తాన్ ఏ
18.07.23 : ఇండియా ఏ vs నేపాల్
21.07.23 : సెమీఫైనల్ 1
21.07.23 : సెమీఫైనల్ 2
23.07.23 : ఫైనల్